జ్యోతిర్మయి మళ్ల (Jyothirmayi Malla)

Share
పేరు (ఆంగ్లం)Jyothirmayi Malla
పేరు (తెలుగు)జ్యోతిర్మయి మళ్ల
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/02/%e0%b0%97%e0%
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారిణి. హిందీ సాహిత్య రత్న కావడం వలన హిందీ, ఉర్దు గజళ్లను, ఆస్వాదిస్తూ, అర్ధం చేసుకోగలిగిన జ్యోతిర్మయి , తెలుగు లోగజల్స్ రాస్తారు , స్వయంగా సంగీతాన్ని సమకూర్చి అలపిస్తారు. జ్యోతిర్మయి గజల్ అకాడెమీ వ్యవస్థాపకురాలు. తెలుగు గజల్ను ప్రపంచ వ్యాప్తం చేయాలనే బలమైన సంకల్పం తో విస్తృత కృషి చేస్తున్నారు. పలువురి చేత గజల్స్ రాయించడమే కాదు వాటిని రాష్ట్ర సంస్కృతిక శాఖ వారి సహాయం తో ‘గజల్ గుల్దస్తా’ పేరిట సంకలనంగా తీసుకొచ్చారు. వివిధ నూతన ప్రక్రియలైన ‘గజల్ ఫ్యూజన్’ వంటి కార్యక్రమాలు, అలాగే గాంధీ 150 వ జయంతి వేడుకలలో భాగంగా, బాపు గురించి రచించిన గజల్ కార్యక్రమం, గజల్ పైన ఒక వర్క్ షాప్ ను కూడా సంస్కృతిక శాఖ సహాయం తో నిర్వహించారు. తెలుగు భాష మన పిల్లలందరూ నేర్చు కోవాలి అన్నదే తపన గా అందుకోసం కవితలు, గేయాలు, కథలు , బొమ్మలు , ప్రసంగాలు . చేస్తూ విస్తృత కృషి చేస్తున్నారు. ఇటీవలే బొల్లిమంత శివ రామకృష్ణ ట్రస్ట్. తెనాలి వారు ‘గజల్ జ్యోతి’ అనే బిరుదు తో సత్కరించారు. దాదాపు అన్ని టీవీ ఛానెల్స్ లోనూ , తెలుగు వెలుగు వంటి ప్రసిద్ధ పత్రికలలోనూ ఇంటర్వ్యూలు ఇచ్చారు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగజల్
సంగ్రహ నమూనా రచనప్రేమే భ్రమయని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు

భ్రమయే బ్రతుకని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు

తడిపొడి మాటలు పొడిపొడి ప్రేమను కప్పేస్తే

అది మేకప్పేనని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు

జ్యోతిర్మయి మళ్ల
గజల్

ప్రేమే భ్రమయని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
భ్రమయే బ్రతుకని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
తడిపొడి మాటలు పొడిపొడి ప్రేమను కప్పేస్తే
అది మేకప్పేనని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
ఎడారి మనసుకు ఒయాసిస్సులా కనిపిస్తుందది
ఎండమావియని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
సుఖాలవేటలొ ప్రేమను వెతికీ దుఃఖాలకె అది
అడ్రస్సవునని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
చరమాంకమె కద మరణం అంటే ప్రేమలొ పడితే
మరునిముషమె అని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు
https://www.neccheli.com/2021/02/%e0%b0%97%e0%b0%9c%e0%b0%b2%e0%b1%8d-14/

———–

You may also like...