విఠలాపురం పుష్పలత (Vithalapuram Puspalatha)

Share
పేరు (ఆంగ్లం)Vithalapuram Puspalatha
పేరు (తెలుగు)విఠలాపురం పుష్పలత
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆమె ఇప్పుడో ఫ్యాషన్ ఐకాన్ (కవిత)
సంగ్రహ నమూనా రచనకాసులు రాల్చే
బ్రాండ్ అంబాసిడర్ ని….! …..

విఠలాపురం పుష్పలత
ఆమె ఇప్పుడో ఫ్యాషన్ ఐకాన్ (కవిత)

కాసులు రాల్చే
బ్రాండ్ అంబాసిడర్ ని….!
కొలతల పేరుతో కోట్లు గడించే
దోపిడి విన్యాసాలు ఒకవైపు..
మాంసపు ముద్దల్ని వేటాడే
మృగాళ్ళొకవైపు…..
వ్యాపార వస్తువుని చేసి
రేటింగ్ పెంచుకునే రేసుగుర్రాలు
బిలియన్లలో
దూసుకుపోతున్నారు
ఔను నేనిప్పుడు ఫ్యాషన్ ఐకాన్ ను
కాసులు రాల్చే బ్రాండ్ అంబాసిడర్ ని…!!
మా అయ్య నన్ను ఎదమీద కుంపటంటాడు.. కట్టుకున్నోడు
పిల్లల్నిగనే యంత్రాన్ని జేసిండు..
ఇంటాబయట చెమటోడ్చినా
నా కష్టం నిత్యం దోపిడీ చేయబడుతూనే ఉంది.. నేనిప్పుడో ఫ్యాషన్ ఐకాన్ ను
శ్రమదోపిడి నిత్యం నాతోనే మొదలు…!
మూఢనమ్మకాల పేరుతో


సిడెకి కట్టి ఊరేగించిన్రు…..
బస్వినిని చేసి
అంగాంగాన్ని దోచుకుంటుండ్రు..
నేనిప్పుడో ఫ్యాషన్ ఐకాన్ ను
చుట్టూచీకటి ఇంకా మిగిలే ఉంది…!
నా ఆహారం మీద
ఆలోచనల మీద
అజమాయిషీ నడుస్తుంటే
స్వతంత్ర దేశంలో
బానిస బతుకు వెల్లదీస్తున్న దైన్యం నాది
ఔను నేనిప్పుడో ఫ్యాషన్ ఐకాన్ ను
స్వతంత్ర దేశంలో కట్టుబానిసను…..!

———–

You may also like...