ఎమ్మెస్ రామారావు (MS Ramarao)

Share
పేరు (ఆంగ్లం)MS Ramarao
పేరు (తెలుగు)ఎమ్మెస్ రామారావు
కలం పేరుసుందరదాసు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/07/1921
మరణం04/20/1992
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తినేపథ్య గాయకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://devullu.com/books/sri-sundarakandam/,

https://www.amazon.in/Telugu-Sundaradasu-M-S-

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీ సుందరకాండము
సంగ్రహ నమూనా రచనశ్రీహనుమంతుడు – అంజనీసుతుడు
అతి బలవంతుడు – రామభక్తుడు |
లంకకు బోయి – రాగల ధీరుడు
మహిమోపేతుడు – శత్రు కర్శనుడు |
జాంబవదాది – వీరులందరును
ప్రేరేపించగ – సమ్మతించెను |
లంకేశ్వరుడు – అపహరించిన
జానకీమాత – జాడ తెలిసికొన | …. ||శ్రీ||

ఎమ్మెస్ రామారావు
శ్రీ సుందరకాండము
1 వ. సర్గ

  1. శ్రీహనుమంతుడు – అంజనీసుతుడు

అతి బలవంతుడు – రామభక్తుడు |

లంకకు బోయి – రాగల ధీరుడు

మహిమోపేతుడు – శత్రు కర్శనుడు |

జాంబవదాది – వీరులందరును

ప్రేరేపించగ – సమ్మతించెను |

లంకేశ్వరుడు – అపహరించిన

జానకీమాత – జాడ తెలిసికొన | …. ||శ్రీ||

  1. తన తండ్రియైన – వాయుదేవునకు

సూర్య చంద్ర బ్ర | హ్మాది దేవులకు |

వానరేంద్రుడు | మహేంద్రగిరిపై

వందనములిడే | పూర్వాభిముఖుడై |

రామనామమున | పరవశుడయ్యె

రోమ రోమమున | పులకితుడయ్యె |

కాయము బెంచె | కుప్పించి ఎగసె

దక్షిణదిశగా – లంక చేరగ …. ||శ్రీ||

  1. పది యోజనముల – విస్తీర్ణముగ – ము

| ప్పది యోజనముల – ఆయతముగ |

| మహామేఘమై | మహార్ణవముపై

| మహావేగమై | మహాకాంతియై |

వారిధి దాటేడు – వాతాత్మజుపై

కురిపించిరి సుర | లు పుష్పవర్షములు |

సాగనంపునటు | ల ఎగసిన తరువులు

సాగరమున రా | ల్చె పుష్పబాష్పములు |

  1. పవన తనయుని – పదఘట్టనకే

పర్వతరాజము – గడగడ వణకే |

ఫల పుష్పాదులు – జలజల రాలె

పరిమళాలు గిరి | శిఖరాలు నిండె |

 

పగిలిన శిలల – ధాతువు లెగసె

రత్న కాంతులు – నలుదిశల మెరసె |

గుహలను ధాగిన – భూతము లదిరి

దీనారముల – పరుగిడే బెదిరి | …..

 

  1. భయపడి పోయిరి – విద్యాధరులు

పరుగిడ సాగిరి – తపోధనులు |

తమ తమ స్త్రీలతో – గగనానికెగిరి

తత్తర పాటున – వింతగ జూచిరి |

 

గగనమార్గమున – సిద్ధచారణులు

పోవుచు పలికిన – పలుకులు వినిరి |

“రామభక్త హను | మానుడీతడని

సీత జాడగని – రాగలవాడని …. ….” ||శ్రీ||

 

సగరుడు మైనాకునితో :-

 

  1. రఘుకులోత్తముని – రామచంద్రుని

పురుషోత్తముని – పావనచరితుని |

నమ్మిన బంటుని – అనిలాత్మజుని

శ్రీ హనుమంతుని – స్వాగతమిమ్మని |

 

నీకడ కొంత వి | శ్రాంతి దీసికొని

పూజలందుకొని – పోవచ్చునని |

సగర ప్రవర్దితుడు – సాగరుడెంతో

ముదమున బలికె – మైనాకునితో ……… ||శ్రీ||

 

  1. కాంచన శిఖర – కాంతులు మెరయ

సాగరమున మై | నాకుడు ఎగయ |

నీలాకాశము – నలువంకలను

బంగరు వన్నెలు – ప్రజ్వరిల్లెను |

 

ఆంజనేయుని – అతిధిగ బిలువ

మైనాకుడు ఉ – న్నతుడై నిలువ |

ఎందరో సూర్యులు – ఒక్కమారుగ

ఉదయించినటుల – తోచె భ్రాంతిగా…. ….. ||శ్రీ||

  1. మైనాకుడు ఉ | న్నతుడై నిలిచె

హనుమంతుడు ఆ | గ్రహమున గాంచె |

ఇదియొక విఘ్నము – కాబోలునని |

వారిధి బడద్రోసె – ఉరముచే గిరిని |

 

పర్వత శ్రేష్ఠుడా – పోటున క్రుంగె

పవన తనయుని – బలముగని పొంగె

తిరిగి నిలిచె హను | మంతుని బిలిచె

తన శిఖరముపై – నరుని రూపమై …. ….. ||శ్రీ||

మైనాకుడు – హనుమంతునితో :-

  1. “వానరోత్తమా | ఒకసారి నిలుమా

నా శిఖరాల | శ్రమదీర్చుకొనుమా |

కందమూలములు – ఫలములు తినుమా

నా పూజలు గొని – మన్ననలందుమా |

 

శతయోజనముల – పరిమితము గల

జలనిధి నవలీల – దాటిపోగల |

నీదు మైత్రి కడు – ప్రాప్యము నాకు

నీదు తండ్రి కడు – పూజ్యుడు నాకు” ||శ్రీ||

 

  1. “కృతయుగంబుగ – విచ్చల విడిగ

గిరులెగిరెడివి – రెక్కలు కలిగి |

ఇంద్రుడలిగి లో | కాలను గావగ

గిరుల రెక్కలను – ముక్కలు జేయగ |

 

వాయుదేవుడు – దయగొని నన్ను

వే వేగముగ – వారిధి జేర్చెను |

దాగియుంటినీ – సాగరమందు

దాచుకొంటినా – రెక్కలపొందు” …. ||శ్రీ||   

https://devullu.com/books/sri-sundarakandam/

———–

You may also like...