| పేరు (ఆంగ్లం) | Yedidamu Satyavathi |
| పేరు (తెలుగు) | ఏడిదము సత్యవతి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | సత్యవతి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యు లో ఓవర్ సీయరు. ఆమెకు ఐదేళ్ళ వయసులో వాళ్ళ ఊరిలోని బాలికా పాఠశాలకు పంపించారు. ఆమెకు చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉండేది. |
ఏడిదము సత్యవతి
సత్యవతి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యు లో ఓవర్ సీయరు. ఆమెకు ఐదేళ్ళ వయసులో వాళ్ళ ఊరిలోని బాలికా పాఠశాలకు పంపించారు. ఆమెకు చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉండేది. పతివ్రతా చరిత్రలు ఎక్కువగా చదివేది. ఆమెకు పది సంవత్సరాల వయసులో కోరంగి గ్రామంలో జరిగిన ఒక ఉపనయన కార్యక్రమానికి హాజరై అతన్నే భర్తగా కావాలనుకున్నది. తర్వాత అతనితోనే ఆమె వివాహం జరిగింది. అతని పేరు సీతారామయ్య. అతను ఎఫ్. ఎ పరీక్షలో ఉత్తీర్ణుడై తర్వాత మామగారి ప్రోద్భలంతో కాకినాడ ఉన్నత కళాశాలలో బి. ఎ చదివాడు. పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు ఉద్యోగంలో చేరాడు. గంజాం జిల్లాలోని శ్రీకాకుళంలో ఆరు నెలలు పనిచేశాడు. తర్వాత ఆముదాలవలసకు బదిలీ అయింది. అక్కడ అతను అకారణంగా ఉద్యోగం కోల్పోయాడు. మద్రాసు వెళ్ళి పోరాడి తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని పైఅధికారి అతనిమీద కోపంతో బమినిగాం అనే ఏజెన్సీ ఏరియాకు బదిలీ చేశాడు. అక్కడ నివసించడానికి అనువుగా లేకపోవడంతో సత్యవతి కొద్ది రోజులు విడిగా ఉండవలసి వచ్చింది. తర్వాత అతనికి దారిగంబాడీ అనే స్టేషనుకు బదిలీ అయ్యింది. అక్కడికి తన భార్యతో పాటు ఒక మనిషిని ఇచ్చి పంపమని మామగారికి ఉత్తరం రాశాడు సీతారామయ్య. కానీ అక్కడి పరిస్థితులు తోడు వచ్చిన ఆమె వెళ్ళిపోయింది. చివరికి దంపతులిద్దరూ అక్కడ కొద్ది రోజులు కాపురం చేశారు. తర్వాత ఇద్దరూ అప్పుడప్పుడూ జ్వరం బారిన పడుతూ ఉండేవారు. కొంతకాలానికి సీతారామయ్య ఆ జ్వరంతోనే కన్నుమూశాడు.
https://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A6%E0%B0%AE%E0%B1%81_%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF
———–