డా.ముక్కామల అప్పారావు (Dr. Mukkamala Apparao)

Share
పేరు (ఆంగ్లం)Dr. Mukkamala Apparao
పేరు (తెలుగు)డా.ముక్కామల అప్పారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/14/1945
మరణం
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1985లో తానా డిస్టింగ్విష్డ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్
భారత ప్రభుత్వంచే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్ 1991
తానా-డిస్టింగ్విష్డ్ కమ్యునిటీ సర్వీస్ అవార్డ్ -1985
భారతప్రభుత్వం చే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్-1991
గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్నీ అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డ్-1992
మిచిగాన్ స్టేట్ మెడికల్ సొసైటీ-డిస్టింగ్విష్డ్ లీడర్ షిప్ అవార్డ్-1993
రోటరీ పౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డ్-1994
జెనిసీ కౌంటీ మెడికల్ సొసైటీ ప్రెసిడెన్షియల్ సిటేషన్-లైఫ్ టైమ్ కమ్యునిటీ సర్వీస్-2008
క్లెమెంట్ ఆల్ఫ్రెడ్ హ్యుమానిటేరియన్ అవార్డ్-2007
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅమెరికా పయనం
సంగ్రహ నమూనా రచనమెడికల్ కోర్స్ పూర్తైన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ముక్కామల అప్పారావు హౌస్ సర్జన్ గా విధులు నిర్వర్తించారు.

డా.ముక్కామల అప్పారావు
అమెరికా పయనం

మెడికల్ కోర్స్ పూర్తైన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ముక్కామల అప్పారావు హౌస్ సర్జన్ గా విధులు నిర్వర్తించారు. తాను ఎంచుకున్న వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూనే.. తనను తాను మరింత సమర్థుడైన వైద్యుడిగా తీర్చిదిద్దుకునేందుకు.. ఇంటర్న్ షిప్ కోసం అమెరికా వైపు అడుగులు వేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని పిట్స్ బర్గ్ సెయింట్ మార్గరిటా హాస్పిటల్ లో ఇంటర్న్ షిప్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటర్న్ షిప్ పూర్తయిన తర్వాత అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ కార్మెల్ మెర్సీ హాస్పిటల్ లో రెసిడెంట్ హౌస్ సర్జన్ గా సేవలందించడం ప్రారంభించారు. అదే మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ హర్లే మెడికల్ సెంటర్ లో రేడియాలజీ విభాగంలో పనిచేశారు. రేడియాలజీతో అత్యున్నత నైపుణ్యం సాధించాలనే తపనతో అడుగులు వేసిన ముక్కామల అమెరికన్ బోర్డ్ ఆఫ్ రేడియాలజీ నుంచి రేడియాలజీ, న్యూ క్లియర్ రేడియాలజీ, పిడియాట్రిక్ రేడియాలజీ సర్టిఫికెట్లు సాధించారు.

అమెరికాకు వచ్చిన ఆనతికాలంలోనే ముక్కామల తన సత్తా చాటారు. అమెరికా మెడియల్ అసోషియన్ లో 1972లోనే సభ్యుడిగా చేరారు. అమెరికా కాలేజ్ ఆఫ్ రేడియాలజీ, మిచిగాన్ రేడియాలజికల్ సోసైటీతో అనేక వైద్య సంఘాలు, సంస్థల్లో సభ్యుడిగా చేరి నలుగురిని కలుపుకుపోవడంతో తాను ఎప్పుడూ ముందుటారనేది నిరూపించారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో వైద్య సంస్థలకు అధ్యక్షుడిగా కూడా ముక్కామల సేవలందించారు.

నాయకత్వ లక్షణాలతో పాటు రేడియాలజీలో నైపుణ్యం క్రమంగా ముక్కామల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. రేడియాలజీలో ఆయన చేసిన పరిశోధనలు, ఆయన అనుభవ పూర్వకంగా నేర్చుకున్న పాఠాలను మెడికల్ విద్యార్థులకు అందించేందుకు ముక్కామల ఎంతగానో కృషి చేశారు. అమెరికాతో పాటు భారత్ లోని అనేక వైద్య సదస్సుల్లో తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. రేడియాలజీపై ఎన్నో వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుతం అమెరికాలోని హర్లే మెడికల్ సెంటర్లోని రేడియాలజీ విభాగం అధిపతిగా ముక్కామల సేవలందిస్తున్నారు.

సమాజం కోసం

ఈ సమాజం నాకు ఏమీ ఇచ్చింది అని కాదు.. ఈ సమాజం కోసం నేనేమి చేశానని ఆలోచించే గల మనస్తత్వం ముక్కామల అప్పారావు తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కిన మెట్లను ఎప్పుడూ మరిచిపోలేదు. అందుకే అమెరికాతో పాటు భారత్ లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేక సేవా సంస్థల్లో సభ్యుడిగా చేరి ఆయా సేవాకార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తోడ్పడుతున్నారు. అమెరికాలో తెలుగువారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు.. వారికి అండగా నిలబడేందుకు ఎప్పుడూ ముక్కామల తపిస్తూనే ఉంటారు. తెలుగు సంఘాలకు తన ఆర్థిక, హార్దిక సాయమందిస్తూ వాటి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అటు అమెరికాలో ఇటు భారత్ లో నిర్వహించడంలో తన వంతు సాయం చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికాలో తెలుగు సంఘం తానాలో కీలక పాత్ర పోషించిన తానా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అమెరికాలో తెలుగువారు ఏ కార్యక్రమం చేపట్టిన సంపూర్ణ మద్దతు చేపట్టిన ముక్కామల అప్పారావు ప్రస్తుతం సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కు ఆయన కొండంత అండగా నిలబడుతున్నారు.

ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు

జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో ముక్కామల గుంటూరు జిల్లాలో ఎన్.ఆర్.ఐ మెడికల్ కాలేజీ, ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ ను ముక్కామల అప్పారావు నెలకొల్పారు. పేద రోగులకు సైతం అత్యాధునిక వైద్యం అందించాలనే ఆశయంతో పెట్టిన ఎన్.ఆర్.ఐ హాస్పటల్స్ నేడు పేదరోగులకు తక్కువ ఖర్చుతోనే ఎంతో ఖరీదైన వైద్యం అందిస్తోంది. పేదవాడికే చెంతకే వైద్యం అందుబాటులోకి రావాలని ముక్కామల భావిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ తరచూ మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి పేదవాడికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది.

మహాదాతృత్వం

ఓ సత్కార్యం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తే..అలాంటి కార్యక్రమాలకు భారీ విరాళాలు ఇచ్చేందుకు ఎప్పుడూ ముక్కామల అప్పారావు ముందుంటారు..ఇండో అమెరికన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పౌండేషన్ కోసం 12 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. అంతేగాకుండా సీవో ఆర్డీ యూఎస్ ఎ సంస్థ సభ్యుడిగా 5 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సేకరించి వైద్య ఆరోగ్య, దార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేలా ప్రోత్సహించారు.

అనాధ ఆడపిల్లలకు అండగా

సాటి మనిషికి ఎలా సాయపడాలని ఆలోచించే ముక్కామల అప్పారావు ఆయన సతీమణి సుమతీ ముక్కామల తమ గురువు చిన్మయనంద బోధనలు వారిలో స్ఫూర్తిని నింపాయి. సేవా పథం వైపు నడిపించాయి.. గుంటూరు జిల్లా కాజాలో ముక్కామల దంపతులు నెలకొల్పిన చిన్మయ విజయ అనాథ ఆడపిల్లల పాలిట వరంలా మారింది. అమ్మ నాన్న లేని అనాథలైన ఆడపిల్లలు, ఎయిడ్స్ బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు, సునామీ దెబ్బకు అనాథలుగా మిగిలిన వారిని చిన్మయ విజయ తన పొత్తిళ్లలోకి తీసుకుంటుంది..నేడు గుంటూరు జిల్లా కాజాలోని చిన్మయ విజయ దాదాపు 200 మంది అనాథ ఆడపిల్లలు అమ్మ, నాన్న లేని లోటును మరిచిపోయేలా చేసింది. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ఇఫ్పుడు చిన్మయ విజయలో విద్యాబోధన జరుగుతోంది. రేపటి పౌరులను సమున్నతంగా తీర్చిదిద్దుతున్నారు.

https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B2_%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

———–

You may also like...