ముదిగంటి సుజాతారెడ్డి (Mudiganti Sujatha Reddy)

Share
పేరు (ఆంగ్లం)Mudiganti Sujatha Reddy
పేరు (తెలుగు)ముదిగంటి సుజాతారెడ్డి
కలం పేరు
తల్లిపేరువెంకటమ్మ
తండ్రి పేరురాంరెడ్డి
జీవిత భాగస్వామి పేరుముదిగంటి గోపాలరెడ్డి
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఅధ్యాపకురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసంస్కృతి సాహిత్య చరిత్ర
శ్రీనాథుని కవితాసౌందర్యం
మను వసుచరిత్రల తులనాత్మక పరిశీలన
తెలుగు నవలానుశీలనం
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్యచరిత్ర
సంకెళ్లుగా తెగాయి (నవల)
మలుపు తిరగిన రథచక్రాలు (నవల)
ఆకాశంలో విభజన రేఖల్లేవు (నవల)
విసుర్రాయి (కథాసంకలనం)
మింగుతున్న పట్నం (కథాసంకలనం)
తొలినాటి కథలు (సంపాదకత్వం – సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి)
నూరేండ్ల తెలుగు కథలు (సంపాదకత్వం – సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి)
అలంకారశాస్త్ర గ్రంథాలు – సంస్కృత సాహిత్యచరిత్ర (ముదిగంటి గోపాలరెడ్డితో కలిసి)
బాణుని కాదంబరి పరిశీలనం (ముదిగంటి గోపాలరెడ్డితో కలిసి)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/literature/telugu-navalanusheelanam-dr-mudiganti-sujathareddy/p-7488847-37813325529-cat.html#variant_id=7488847-37813325529,
పొందిన బిరుదులు / అవార్డులుచాసో అవార్డు
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం -2007
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలలో ప్రభుత్వ విశిష్ట ప్రతిభా పురస్కారం -2016
ఇతర వివరాలుhttp://pustakam.net/?tag=mudiganti-sujatha-reddy
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముదిగంటి సుజాతారెడ్డి కథలు (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనతెలుగు సాహిత్యరంగంలో తెలంగాణ భావనను మేధోపరంగా సాహిత్యపరంగా అందిస్తున్న వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ముఖ్యులు. నవలా, కథా రచయిత్రిగా, ముదిగంటి సుజాతారెడ్డి మార్గం స్వతంత్రమైనది.

ముదిగంటి సుజాతారెడ్డి
ముదిగంటి సుజాతారెడ్డి కథలు (పుస్తకం)

తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణ భావనను మేధోపరంగా సాహిత్యపరంగా అందిస్తున్న వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ముఖ్యులు. నవలా, కథా రచయిత్రిగా, ముదిగంటి సుజాతారెడ్డి మార్గం స్వతంత్రమైనది.

విసుర్రాయి కథలో సక్కుబాయి శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్న స్త్రీ. విసుర్రాయి సక్కుబాయికి సంకేతనామం. విసుర్రాయి తిప్పినంతసేపూ తిరుగుతూనే ఉంటుంది. తనకు నిజంగా తిరగాలన్న కోరిక లేకపోయినా విసుర్రాయి తిరగక తప్పదు. దాన్ని ఎవరో ఒకరు తిప్పుతారు కాబట్టి ఆ తిప్పే వ్యక్తి సుబ్బారావేనని కథలో తొలినుంచీ అర్థమవుతున్నా, పురుషాధిక్య సమాజం కుటుంబం అన్నాక ఇవన్నీ చాలామంది చేయరా? అని అనవచ్చు. కానీ ఈ పురుషాధిక్య సమాజంలోని పురుషులూ సుబ్బారావు పట్ల విముఖత చూపడానికి కథలోని చివరి సన్నివేశం తోడ్పడుతుంది. సక్కుబాయి విసుర్రాయి అన్న సంకేతాన్ని విప్పి చెప్పే సన్నివేశం చివరికి చిత్రించారు రచయిత్రి. 

‘బేరం’ కథ పట్టణీకరణ ఊరి యువకుడిని పెడదారి పట్టించిన తీరును చెబుతుంది. భార్యను అమ్మాడని తెలిసి మల్లయ్య ప్రతిఘటించికపోవడం తాను కొనాల్సిన రెండెడ్ల కొరకు భార్యను అమ్మినా తప్పులేదని అనుకోవడంతో కథ ముగించడం ద్వారా భద్రన్నకంటే మల్లయ్య వంటి వ్యక్తులే ఎంతో దుర్మార్గులని పాఠకుడికి అర్థం చేయించారు సుజాతారెడ్డి.

బందీ ఎగువమధ్య తరగతి మహిళ జీవితం. కూతురి కాన్పుకోసం అమెరికా వచ్చిన అన్నపూర్ణకు తాను బందీ అన్న స్పృహ కలగడంతో కథ ముగించడం ద్వారా ప్రేమ, ఆప్యాయతలు కూడా మనుషుల్ని ఎలా బందీలుగా మారుస్తున్నాయో చెప్పారు. మారిన పరిస్థితులు, ఆచారాలు, పెంపకపు పద్ధతులు చెబుతూనే అన్నపూర్ణ కొత్త పరిస్థితుల్లో బందీ అయిన తీరును వివరించారు.

మరో మార్క్స్‌ పుట్టాలె అన్న శీర్షిక కథకు ఎన్నుకోవడం ద్వారా సుజాతారెడ్డి పని గంటల కోసం అన్న అర్థాన్ని కల్పించారు.

సీతయ్య చెల్క రాజకీయ క్రీడలో భూమిని కోల్పోయిన సీతయ్య కథ. మంత్రులు, రాజకీయ సభలు, సంక్షేమ సభలు ఏర్పాటు చేయడంలో చూపే ఉత్సాహం, దాని వెనకున్న ఆలోచనల డొల్లతనం ఈ కథ వివరిస్తుంది.

అడవి రాజ్యం కథ హైదరాబాద్‌ భూ కబ్జాలను, భూ మోసాలను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది. ఆటవిక నీతి నాగరిక సమాజంలో ధనస్వామ్య రూపంలో అడుగిడిన రీతిని ఈ కథ చెబుతుంది.

గుడిసెలు… గుడిసెలు కథ చదవగానే బోయిభీమన్న గుడిసెలు కాలిపోతున్నై గుర్తుకు వస్తుంది.

9/11 లవ్‌ స్టోరీ కథ ప్రతీకాత్మక కథ. ప్రేమ, స్నేహ భావం లేని రెండు హృదయాలు, దేశాలు సృష్టించిన మారణహోమం, బిల్డింగ్‌ పతనం. 

ఇలా వ్యాపార మృగం కథ దురలవాట్లకు బానిసలవుతున్న ప్రజలను దాని నుండి దూరం చేయడమే లక్ష్యంగా పనిచేసిన పులి మాధవి సాహసం కథ ఇది.

http://www.anandbooks.com/Mudiganti-Sujatha-Reddy-Kathalu-Telugu-Book-By-Mudiganti-Sujathareddy

———–

You may also like...