| పేరు (ఆంగ్లం) | Bootam Muthayalu |
| పేరు (తెలుగు) | భూతం ముత్యాలు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | విమల |
| పుట్టినతేదీ | 1971 జూన్ 10 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | నల్గొండ జిల్లా లోని నాంపల్లి మండలానికి చెందిన తిరుమల గిరి |
| విద్యార్హతలు | బి.యిడి |
| వృత్తి | రచయిత, ఉపాధ్యాయుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | దుగిలి (దళిత కవిత్వం) – 2003[2] సూర (దళిత జీవితం రెండు తరాల కుటుంబ వ్యధ) – 2004: ఈ పుస్తకాన్ని కాకతీయ యూనివర్శిటీ తెలుగు 4వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టుగా పెట్టారు. పురుడు (మాలల సంస్కృతి , జీవితాల గురించి) – 2007 బేగరి కథలు ( దళిత మైనార్టీల గురించి ) – 2010 ఇగురం (నవల) – 2012 |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/book/Sura |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2017 సంవత్సరానికి రాసిన మొగలి నవల రచనకు ఉత్తమ నవలా విభాగంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం పొందాడు.[4] 2017 జూన్ 2 న తెలంగాణా రాష్ట్ర సాహిత్య పురస్కారం నల్లగొండ జిల్లా స్థాయిలో స్వీకారం 2017 సంవత్సరానికి నల్గొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు 2019 సంవత్సరానికి B.S.రాములు ప్రతిభా విశాల సాహితీ పురస్కారం అందుకున్నారు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | సూర (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | నేను సూర నవలని ఆత్మకధనాత్మక శైలిలో రాయాలని అనుకున్న. |
భూతం ముత్యాలు
సూర (పుస్తకం)
నేను సూర నవలని ఆత్మకధనాత్మక శైలిలో రాయాలని అనుకున్న. నా చుట్టూ అల్లుకున్న జీవితాలు, వలస బత్కులు, బతుకుదెరువు ఊగిసలాట, దళితుల అనిచివేత, కులవృత్తుల ధ్వంసం, సాంఘిక బహిష్కరణ మా జీవితాల్లో నిత్యకృత్యాలే. అలా జీవిత యదార్థ గాదే ఈ నవల పేర్లు, పాత్ర పేర్లు. ప్రాంతం పేరు కల్పితమైనా నా జీవిత సంఘటనల రూపమే ఈ నవల. అంబేద్కర్ ఆలోచనా విధానం, గ్రామాల్లో మార్పు రానంతవరకూ రూపుదాల్చదు. అలా జరగాలంటే కులాంతర వివాహాల ప్రోత్సాహం, కులనిర్మూలన, ఇతర మత స్వీకరణ, తమ అస్థిత్వాన్ని తెలపడం, నిల్పుకోడం, అవాంతరాలెన్నైన ఎదురొడ్డి నిల్వడం ఇదే ఈ నవల సారం. ఐతే దళిత నవలల్లో కనిపించని ఒకే ఒక అంబేద్కర్ ఆశయం కులాంతర వివాహం ఈ నవలలో కనవస్తుంది. ఈ నవలను ఆదరించిన, ఆదరిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.
కాకతీయ యూనివర్సిటీ వారు వేముల ఎల్లయ్య గారి సిద్ది నవలతో పాటుగా సూర దళిత మాండలీక నవలని ఎం.ఎ. తెలుగులో ఫోర్త్ సెమిస్టర్‌లో సిలబస్‌లో చేర్చడంతో నా ప్రయత్నం వృదా కాలేదనిపించింది.
https://kinige.com/book/Sura
———–