మామిడిపూడి వెంకట రంగయ్య (Mamidipudi Venkatarangayya)

Share
పేరు (ఆంగ్లం)Mamidipudi Venkatarangayya
పేరు (తెలుగు)మామిడిపూడి వెంకట రంగయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/08/1889
మరణం01/13/1981
పుట్టిన ఊరునెల్లూరు
విద్యార్హతలురాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ
వృత్తిరచయిత, విద్యావేత్త
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకౌటిలీయార్ధ శాస్త్రము,సాక్రటీసుయొక్క సందేశము,హిందూ దేశ చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపద్మ భూషణ్ పురస్కారం
ఇతర వివరాలు

https://web.archive.org/web/20100808051826/

http://naprapamcham.blogspot.com/2008_02_01_archive.html

స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచనబాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు.

మామిడిపూడి వెంకట రంగయ్య

బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత .

ఉద్యోగము

రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహం మీద కాకినాడ లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలో యువరాజైన అలకనారాయణ గజపతికి విద్యాదానం చేశారు తర్వాత సంస్థానంలో దివానుగా నియమితులయ్యారు.

వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు.

ఇతనికి భారత ప్రభుత్వం 1968లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

 

వ్యక్తిత్వం

ఎంతటి చిన్నవారైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. చివరి రోజులలో మంచం మీద పడుకునే వ్రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు

నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని జాయింట్ రచయితలుగా వ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమిషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు

ఇతనికి భారత ప్రభుత్వం 1968 లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF

———–

You may also like...