| పేరు (ఆంగ్లం) | Kura Chidambaram |
| పేరు (తెలుగు) | కూర చిదంబరం |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/tag/Kura+Chidambaram, |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఉషస్సు (పుస్తకం) |
| సంగ్రహ నమూనా రచన | థారచనకు ఒక సంఘటన మూలం. జీవితంలో అనేకానేక సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో చెప్పుకోతగ్గ విశేషం ఉన్నప్పుడు, అసాధారణంగా ఉన్నప్పుడు కథారూపం ఇస్తారు. |
కూర చిదంబరం
ఉషస్సు
కథారచనకు ఒక సంఘటన మూలం. జీవితంలో అనేకానేక సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో చెప్పుకోతగ్గ విశేషం ఉన్నప్పుడు, అసాధారణంగా ఉన్నప్పుడు కథారూపం ఇస్తారు. సాధారణంగా కనిపించే సంఘటనల్లో మనకు తెలియకుండానే అసాధారణాంశాలుంటాయి. వాటిని కథకులు మాత్రమే చూడగలరు. అక్షర రూపంలో పెట్టగలరు. కూర చిదంబరంగారు సరిగ్గా అదే పనిచేశారు. మనం చూస్తూ కూడా ఉపేక్షించే విషయాల్ని కథలో చదివినప్పుడు విస్తుపోతాం. విస్మయానికి లోనవుతాం.
ఇలాంటి అంశాలే చిదంబరం గారి కథల్లో కనిపిస్తాయి. కథాకథనంలో చూపిన నేర్పు, కథలకు పెట్టిన శీర్షికలు కథల్ని చదవాలన్న ఉత్సుకతను కలిగిస్తాయి. మానవ సంబంధాల్లోని ఆర్తిని, ఆర్ద్రతను పట్టుకోడంలో రచయిత సఫలమయ్యారు. కొన్ని సంఘటనలే మనిషిలోపలి అసలు రూపాన్ని, అంతస్సారాన్ని అర్థం చేయిస్తాయి.
కథ చెప్పే రచయిత తీర్పరి కానక్కర్లేదు. జీవిత వాస్తవాల్ని దర్శింపజేయడనికి రచయిత పరిమితం కావాలి. ఆయా సంఘటనల పర్యవసానాలని పాఠకుల యోచనకు విడిచిపెట్టడం కథాశిల్పంలో ఒక భాగం. దీనిని చిదంబరం గారు గుర్తించారు. కనుకనే కథల ముగింపులో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. కథను యధాతథంగా చెప్పడానికే పరిమితమయ్యారు. తమ అనుభవ పరిధిలో చూసిన జీవితాన్ని, అనేకరకాల మానవ సమూహాల ప్రవర్తనను ఆకళింపు చేసుకుని రచయిత ఈ కథలు రాశారని బోధపడుతుంది.
ఇందులోని పధ్నాలుగు కథలు, మూడు నాటికలు చదివితే మానవ సంబంధాల్లోని వైచిత్రి తెలుస్తుంది. మనుషుల మధ్యన వున్న వైరుధ్యాలు అర్థమవుతాయి. అలాగే మానవ సంబంధాల్లో ఏవిధమైన విలువలు రాజ్యం చేస్తున్నాయో, మనం ఏవిధమైన విలువల్ని అలవరుచుకోవాలో రచయిత చెప్పకనే చెప్పారు.
https://kinige.com/book/Ushassu
———–