జి.వెంకటకృష్ణ (G. Venkatakrishna)

Share
పేరు (ఆంగ్లం)G. Venkatakrishna
పేరు (తెలుగు)జి.వెంకటకృష్ణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ05/28/1965
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలోని బూడిదగడ్డపల్లె
విద్యార్హతలుచరిత్రలో ఎం.ఏ. మరియు ఎం.ఫిల్
వృత్తితెలుగు కథకుడు, కవి, మరియు విమర్శకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.saarangabooks.com/telugu/tag/%
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగోడలు (కవిత్వం)
సంగ్రహ నమూనా రచననీ కోసం ఒక గోడ యెదురు చూస్తున్నది
గోడలకు సమాధి కట్టాలని చూసే నిన్ను
గోడ సమాధిలా హత్తుకోవాలని చూస్తున్నది.

జి.వెంకటకృష్ణ
గోడలు (కవిత్వం)

నీ కోసం ఒక గోడ యెదురు చూస్తున్నది

   గోడలకు  సమాధి కట్టాలని చూసే నిన్ను

   గోడ సమాధిలా హత్తుకోవాలని చూస్తున్నది.

   గోడలు చేసిన గోడలు, గోడలు నిర్మించిన గోడలు

   గోడల పాదాలతో నడిచొచ్చే గోడలు

   గోడల చేతులతో నిన్నాహ్వానిస్తున్నవి.

    అభివృద్ధి చేస్తున్న గోడల్ని అవహేళన చేస్తావనీ

    సింహాసనాల్నెక్కే గోడల్ని పరిహసిస్తావనీ

   సౌకర్యాలిచ్చే గోడల్ని కంచెలంటున్నావనీ

   సంపదపరిచే గోడల్ని సమతుల గోతులంటావనీ

    గోడల మర్మమెరిగిన నీకు తమ రూపును

    చూపడానికి గోడలు యెదురుచూస్తున్నవి.

     పరుగులెత్తే గోడల పోటీతనం ఆపమంటావనీ

    నిలువనీటి గోడల మురికిని కడగమంటావనీ

   నీతులు వళ్లించే గోడల బండారం యెండగట్టాలనీ

   పుట్టగొడుగుల్లా మొలిచే గోడల్ని పెకిలించాలనీ

    గోడల కీళ్లెరిగి వాతపెట్టాలనే నిన్ను చేరడానికి

    గోడలు బారెడు లాఠీల అంగలు వేస్తున్నవి.

                          2

     కవీ

     నువ్వు నిలబెట్టిన గోడలు

      నిన్ను నిలబెట్టిన గోడలూ

    యే నిర్మాణంలోనో రక్తంలా జీర్ణమయ్యాక

    రాళ్లను వెతుకుతూ

    యే గోడలోని వ్యూహమో

     నీ కోసం రాక తప్పదు.

      నిరీక్షణల గోడ యెదుట నిలబడ్డాక

      అనివార్యమైన మౌనం

     గోడల ముందు ప్రతిధ్వనిస్తుంది

     రాళ్లలోని రహస్య నేత్రాలను

     తప్పక యెదురుచూస్తుంది.

      నిర్మాణాల యెదుట నిలబడిన

     రాళ్లలోని గోడతనాన్ని

     తప్పక ప్రశ్నిస్తుంది.

      గోడల మీద నెపమో

      రాళ్లమీద ధ్వేషమో

      మనలోనూ గోడతనంలా

      కరుడుగట్టి వుంటుంది.

       గోడల మీద తలపడటానికి

       మనమూ రాళ్లలా మారిన గోడలమే

      మనకు అందని రాళ్లను

      నెపపెట్టే నిర్మాణకౌశలాలమే.

                    3

       కవీ

      రాయిని రాయిని రాజుకునే సెగతో

      గోడల వద్దకు వెళ్దాం మనం

     గోడల చేతులకూ

     శ్రమసౌందర్య స్పృహను పులుముదాం

     చేతులకు అందే రాళ్లలా మసులుదాం

    చేతులకు అందని రాళ్లనూ చేరుదాం.

      గోడలోని రాళ్లనూ

      రాళ్లలోని గోడలనూ

      బధ్ధలు చేసేందుకు

      నిప్పులా వెళ్తున్న కవికి

     బాసటగా నిలబడదాం.

———–

You may also like...