జాన్సన్ చోరగుడి (Johnson Chiragudi)

Share
పేరు (ఆంగ్లం)Johnson Chiragudi
పేరు (తెలుగు)జాన్సన్ చోరగుడి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/04/1956
మరణం02/01/1992
పుట్టిన ఊరుకోలవెన్ను
విద్యార్హతలు
వృత్తిరీజనల్ డిప్యుటీ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/home/search?q=Johnson%20Choragudi
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసొంత సంతకం (పుస్తకం)
సంగ్రహ నమూనా రచన“ఆశిష్ నంది భవిష్యత్ భారత జాతికి ఒక ‘మాగ్నాకార్జా’ను ప్రకటించారు.

ఇకముందు – దానిని మరింత సరళీకరించగలిగిన సృజన శక్తుల చొరవ ఇప్పుడు……………….

జాన్సన్ చోరగుడి
సొంత సంతకం (పుస్తకం)

“ఆశిష్ నంది భవిష్యత్ భారత జాతికి ఒక ‘మాగ్నాకార్జా’ను ప్రకటించారు.

ఇకముందు – దానిని మరింత సరళీకరించగలిగిన సృజన శక్తుల చొరవ ఇప్పుడు

ఇక్కడ మనకు అవసరం. అందుకు ‘ఇండియన్ సైక్’లోనే ఓ పెద్ద కుదుపుతో కూడిన

భావనాత్మక బదిలీ జరగాల్సి ఉంది. కులీన వర్గాలు వారి అవినీతిలో నిర్లక్షిత వర్గాలకు

భాగస్వామ్యం ఇవ్వడం చిన్న విషయం ఏమీ కాదు. మొదట, అటువంటిది

ఒకటి ఉందని సంబంధిత వర్గాలు ఒప్పుకోవడం దగ్గర నుండి ఆ దిశలో

తొలి అడుగుపడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఎరుక కూడా మనకు అవసరం.

దీనికి ప్రపంచీకరణ తర్వాత, మనం అంగీకరించిన సరళీకరణ

ప్రక్రియ కారణమని మనం గుర్తెరగాలి”.

             ఈ పుస్తకంలో ప్రతి ఒక్క విషయాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు చదవల్సిన పుస్తకం ఇది. ఇందులోని కొన్ని ముఖ్య విషయాలు ఇవి:

  1. ప్రజలు :

– పేదల కోసం ‘ఇందిరమ్మ’ : సత్యమా, అర్ధసత్యమా?

– ఓటరు నాడి అందకపోవడం నిజమేనా?

– సాగునీటి ప్రాజెక్టులు… సామజిక అంశాల దృష్టికోణం

– కోస్తాను వదలని ‘పాత వాసనలు’ ?

– వర్ధమాన సమాజాల సరళీకరణ దృష్ట్యా… విభజన ఓటమికాదు, విజయమే ?

– ‘కళింగ – 2’కు కావాలిప్పుడు ఖడ్గం లేని అశోకుడు!

  1. ప్రభుత్వము :

– ఇది ఒక దశ… కలక్టర్లు దేవుళ్ళెం కాదు కదా?

– ప్రభుత్వ సర్వీసులపై చర్చ అవసరమా?

– ‘సునామీ’ ప్రపంచానికి వెల్లడైన భారత్ స్వావలంభన శక్తి!

– పోలవరంతో సాకారం కానున్న సాగుసందడి స్వప్నం!

– జాతీయ ఉపాధి పధకం… సత్పలితాలపైనా సందేహాలేనా?

– ‘ఇందిరమ్మ రాజ్యం’ ఒక భావనా లేక మార్గమా?

  1. సమాజం

– హక్కుల పోరాటంలో ఎన్నాళ్ళి ‘మంద’గమనం?

– నిన్ను కులాలు – సంస్కరణలను సానుకూలంగా మలచుకోవా?

– ప్రభుత్వాలు, ఒత్తిడిగుంపులు, మీడియా, ప్రజలు?

              ఇంకా పలు విషయాలు గురించి చోరగుడి జాన్ సన్ గారు తెలియజేశారు. తెలుగు సమాజం, చరిత్ర గమనంలో, ప్రత్యేకించి, ఆధునిక యుగంలో లభించిన అవకాశాలనుపయోగించుకొని క్రియాశీలంగా రూపుదిద్దుకొంది. మార్పులకు స్పందిస్తోంది. చరిత్రలో ప్రతి ఘట్టమూ ముఖ్యమే! కానీ, యివ్వాళ చరిత్ర మరింగ, వూహించలేనంతగా, సంచనాలకు గురవుతోంది. ఈ పరిణామాలను అధ్యయనం చేయడంలో చోరగుడి జాన్ సన్ గొప్ప ఉపగ్నతను ప్రదర్శిస్తున్నారు. జాన్ సన్ సంప్రదాయ రీతిలో సామజిక శాస్త్రవేత్త కాదు. నిజంగా ఆలోచిస్తే, వారికది ప్రతికూలత కాకపోగా అనుకూలతే! సమాజంలో సాధారణ పౌరుడిగా వుంటూనే, నిశిత పరిశీలనతో, తృణ మూలాల్లోకీ వెళ్లి, సామాన్యుల రోజువారీ జీవితాల్లోని పడుగుపేకల్ని, బృహత్ స్థాయిలో చోటు చేసుకొంటున్న మార్పులతో అనుసంధానించి విశ్లేషిస్తున్నారు. సమకాలీన సమాజంలో భాగాలైన ప్రజలు, ప్రభుత్వం, మీడియా, ప్రాంతం – వీటికి ఈ గ్రంథం దర్పణం.

           మనకున్న కొద్ది సామజిక విశ్లేషకుల్లో చోరగుడి నిస్సంశయంగా ఒకరు.

– వకుళాభరణం రామకృష్ణ

చరిత్ర, పూర్వశాఖాధిపతి

కేంద్రీయ విశ్వ విద్యాలయం

హైదరాబాద్.

https://www.logili.com/books/johnson-choragudi/p-7488847-43161810409-cat.html#variant_id=7488847-43161810409

———–

You may also like...