జగదీశ్ మల్లిపురం (Jagadesh Mallipuram)

Share
పేరు (ఆంగ్లం)Jagadesh Mallipuram
పేరు (తెలుగు)జగదీశ్ మల్లిపురం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1973 నవంబరు 14
మరణం
పుట్టిన ఊరుశ్రీకాకుళం జిల్లా లోని గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) సమీపంలోని పి.ఆమిటి గ్రామం
విద్యార్హతలు
వృత్తిఐ.టీ.డీ.ఏ.లో ఉపాధ్యాయులు
రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసిలకోల (2011), గురి (2018)
“దుర్ల” కవితా సంపుటి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

http://www.anandbooks.com/Guri-Telugu-Book-By-Mallipuram-Jagadeesh,

https://kinige.com/book/Silakola,

https://www.logili.com/short-stories/guri-mallipuram-jagadeesh/p-7488847-28675815789-cat.html

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశిలకోల (పుస్తకం)
సంగ్రహ నమూనా రచనఈ రెండోతరం స్ఫూర్తితో కలం పట్టిన మూడోతరం వారిలో మల్లిపురం జగదీశ్ ఒకడు. నేనెరిగిన మేరకు అతడు అచ్చమైన కొండబిడ్డ కూడా…..

జగదీశ్ మల్లిపురం
శిలకోల (పుస్తకం)

ఈ రెండోతరం స్ఫూర్తితో కలం పట్టిన మూడోతరం వారిలో మల్లిపురం జగదీశ్ ఒకడు. నేనెరిగిన మేరకు అతడు అచ్చమైన కొండబిడ్డ కూడా. అందుచేతే అక్కడ గతంలోనూ, వర్తమానంలోనూ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోగోరేవారికి అతని రచనలు అమూల్యాలనిపిస్తాయి. ఆ కారణం చేతే అతను చేసే ప్రతీ రచనా నేను శ్రద్ధగా చదువుతుంటూను చదివించినంత కాలం.

– కాళీపట్నం రామారావు

* * *

ఆదివాసీల జీవితం, ఆదీవాసీలలోని అంతర్గత పొరలు, కొన్ని దశాబ్దాల కాలం నాటి పరిణామాల పరంపరలో భాగంగా జీవవ సరళిలో వస్తున్న మార్పులు ఈ కథల్లో చిత్రతమయ్యాయి. ఇంత ప్రబలంగా ఆదివాసీల జీవితాన్ని చిత్రించిన కథలు ఇదివరలో రాలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఆదివాసీలు, ఒరిస్సా సరిహద్దులని ఆనుకొనివున్న ఏజన్సీ ఏరియాలోని ఆదివాసీల బతుకు చిత్రణ తెలుగు కథా సాహిత్యంలో కొంచెం విస్తృతిలో రికార్డు కావడం ఇదే మొదటిసారి.

– గుడిపాటి

* * *

నిన్నటి గాయాలకు కారణాలు, కారకులూ తెలుసు. మరి నేటి గాయల గురించినదో? అది జగదీశ్ మాత్రం యెలా చెప్పగలడు? అయినా శిలకోల ధరించమంటున్నారు. బహుశా గాయపడిన వారు శిలకోల ధరించక తప్పదేమో! సాహిత్యం సమాజానికి శిలకోల లనందిస్తుందా? సమాజం సాహిత్యానికి శిలకోల లనందిస్తుందా?

– అట్టాడ అప్పలనాయుడు

* * *

ఉత్తరాంధ్ర నుండి కొత్త కథా కెరటంగా, తొలి ఆదివాసీ సృజన కళాకారుడిగా, కథకుడిగా కొండ కోన మీద నిలబడి తన గొంతు వినిపిస్తున్నాడు చి. జగదీశ్. కథకుడూ, గాయకుడూ అయిన జగదీశ్ కలమూ, గళమూ రెండు ఆయుధాలుగా సాధించబోయే విజయాల కోసం… “శిలకోల”ను సంధిస్తున్న ఈ విలుకాడి కోసం అడవి ఆత్రంగా ఎదురు చూస్తోంది.

– గంటేడ గౌరునాయుడు

https://kinige.com/book/Silakola

———–

You may also like...