సమ్మెట ఉమాదేవి (Samatha Umadevi)

Share
పేరు (ఆంగ్లం)Samatha Umadevi
పేరు (తెలుగు)సమ్మెట ఉమాదేవి
కలం పేరు
తల్లిపేరులక్ష్మీ తులసీబాయి
తండ్రి పేరుసమ్మెట పోతరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/17/1961
మరణం
పుట్టిన ఊరువరంగల్
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://vihanga.com/?p=10084
స్వీయ రచనలుఅమ్మ కథలు,సమ్మెట ఉమాదేవి కథానికలు,జమ్మిపూలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/author/Sammeta+Umadevi
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీ శాంతి దుగ్గిరాల రచించిన లచ్చి
సంగ్రహ నమూనా రచనపల్లెల్లో చిన్న పిల్లలు కుర్ర పిల్లలు గుంపులు గుంపులుగా ఊరంతా సందడి చేయడం సాధారణం. తోట యజమాని కన్ను గప్పి పళ్ళు కాయలు .. ఇంటి యజమాని కన్ను కప్పి పూలు పళ్ళు తెచ్చుకుని సరదాగా అందరూ పంచుకుని తింటూ గడపడం అదో అనిర్వచనీయ మయిన ఆనందం.

సమ్మెట ఉమాదేవి
శ్రీ శాంతి దుగ్గిరాల రచించిన లచ్చి

పల్లెల్లో చిన్న పిల్లలు కుర్ర పిల్లలు గుంపులు గుంపులుగా ఊరంతా సందడి చేయడం సాధారణం. తోట యజమాని కన్ను గప్పి పళ్ళు కాయలు .. ఇంటి యజమాని కన్ను కప్పి పూలు పళ్ళు తెచ్చుకుని సరదాగా అందరూ పంచుకుని తింటూ గడపడం అదో అనిర్వచనీయ మయిన ఆనందం. ఆ స్నేహం లోని ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది. తమకో సన్నిహితురాలిగానే కాకుండా నాయకురాలిగా కూడా మెలిగిన లచ్చి జట్టును, పల్లెనూ వీడిపోయే పరిస్తితి ఆమె పెళ్లి వలన వచ్చింది. ఆ కొత్త లోకం లోకి తప్పనిసరిగా వెళ్లి ఆమె అక్కడ ఒకింత బాగానే ఒదిగి పోతుంది లచ్చి.. కాని తమ నేస్తాన్ని వదులోకోలేని మిగితా పిల్లలు దుఃఖ పడతారు. నెల్లాల్లకు తమ ఊరికి వచ్చిన నేస్తాన్ని చూసి పొంగి పోతారు. కానీ లచ్చి ఇప్పుడు ఓ సిసలయిన వివాహితలా గంభీరంగా మిగిలిపోతుంది. పిల్లలంతా ఇదంతా పెళ్ళి తెచ్చిన మార్పు అనుకుంటూ దిగులుతో వెనుతిరుగుతారు.

 

పల్లె చిత్రమే మారి పోతున్న ప్రస్తుత తరుణంలో పల్లె వాతహవరణన్ని.. చిన్న నాటి జ్ఞాపకాలను చిత్రించే కథలను వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తాను .. ఇప్పటికే పుట్టెడు ఇలాంటి కథలు రావచు .. ఇంకో గుట్టెడు వచ్చినా నష్టం లేదు ..ఎందుకంటే అందరికీ పల్లె నేపధ్యపు అనుభవాలు ఉండవు . ఇలాంటి అనుభవాలు ఉన్నవారంతా కథకులు కాకా పోవచ్చు.. ముందు ముందు ఈ పల్లెలూ ఉండవు ఈ జ్ఞాపకాలు ఉండవు కాబట్టి రాయగిగిన వాళ్ళు రాయగలిగినన్ని రాయాల్సిందే . పల్లె చరిత్రను అక్షర బద్దం చేయాల్సిందే .. రచయిత్రి పల్లె యాసను బాగా ఉపయోగించి అక్కడి వాతావరణాన్ని చక్కగా నిర్వహించగలిగారు. కథ చదవడం పూర్తి కాగానే.. ఎక్కడో కథ ఇప్పుడే అయిపోయిన్దేమిటి అని అసంతృప్తి కలిగే అవకాశం మాత్రం ఉన్నది. కథ చదువుతుంటే కొడవటి గంటి చిట్టి గుర్తుకు వస్తుంది.

———–

You may also like...