పేరు (ఆంగ్లం) | Athaluri Vijayalakshmi |
పేరు (తెలుగు) | అత్తలూరి విజయలక్ష్మి |
కలం పేరు | – |
తల్లిపేరు | అనసూయ |
తండ్రి పేరు | నరసింహారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1996 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత్రి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | దత్తపుత్రుడు మహావృక్షం నేనెవరిని? బొమ్మ పేరైనా అడగలేదు శ్రీకారం ప్రేమిస్తే ఏమవుతుంది? ఏ పుట్టలో ఏమున్నదో హిమజ్వాల |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Athaluri+Vijayalakshmi, https://kinige.com/book/Atithi, https://kinige.com/book/Tella+Gulabi, https://www.logili.com/home/search?q=Athaluri%20Vijayalakshmi, http://www.anandbooks.com/Ashtavakra-Nayikalu-Telugu-Book-By-Athaluri-Vijaya-Lakshmi |
పొందిన బిరుదులు / అవార్డులు | నార్ల వెంకటేశ్వరరావు పురస్కారం విశిష్టమహిళ పురస్కారం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక వారి సన్మానం యునిసెఫ్ అంతర్జాతీయ పురస్కారం ఆకాశవాణి నాటకానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం కొలకలూరి ఇనాక్ ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారం జ్యేష్ట లిటరరీ సాహిత్య పురస్కారం “నార్ల” విశిష్ట రచయిత్రి పురస్కారం అబ్బూరి రుక్మిణమ్మ స్మారక పురస్కారం బాదం సరోజాదేవి స్మారక పురస్కారం జ్యోత్స్న కళా పీఠం ఉత్తమ రచయిత్రి పురస్కారం అమృతలత “అపరూప” ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారం కమలాకర ట్రస్ట్ ఉత్తమ రచయిత్రి పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అతిథి(నవల) |
సంగ్రహ నమూనా రచన | అత్తలూరి విజయలక్ష్మి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఈమె అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. ఈమె పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమె సరసిజ అనే పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు. |
అత్తలూరి విజయలక్ష్మి
అతిథి(నవల)
“అదేంటే మీ ఆయన్ని మాట్లాడనివ్వవా ఏంటి అన్ని నువ్వే చెబుతున్నావ్ .. “
విమల నవ్వుతూ అంది .. “చెప్పాగా .. చాలా కొత్త ఆయనకి .. నీకో సంగతి తెలుసా .. ఆయన కెమిస్ట్రీలో పి.హెచ్.డి చేశారు.. బైట నేమ్ ప్లేట్ చూశావో లేదో డాక్టర్ రాజశేఖర్ అని ఉంటుంది .. టాక్టిక్స్ లేక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రమోషన్ పోగొట్టుకున్నారు..”
“అరరే అలాగా .. ఇలా ఉంటే కష్టం సార్ .. బైదిబై .. నాకేం అవుతారు విమలా ..”
“ఏం అవడం ఏంటి? మీ అమెరికా వాళ్ళకి వరసలు తెలియవా? నా మేనత్త కూతురువి.. నీకు నేను వదిన తను అన్నయ్య.. “
శేఖర్ చేతులు సన్నగా వణికాయి.. విమలవైపు చూడాలనుకున్నాడు కానీ, మనస్కరించలేదు.. మలయ వైపు కూడా.. ఆమె మోహంలో భావాలు చూడాలనుకున్నాడు.. కానీ ధైర్యం సరిపోలేదు.
విమల తలవంచుకుని ఇడ్లి తింటోంది.
శేఖర్‌కి త్వరత్వరగా అక్కడినుంచి వెళ్లిపోవాలనిపించింది ..
ఈమె పేరు .. మలయా? ..కాదు , కాదు.. ఈమె .. ఆమెలాగే ఉంది.. పరిశీలనగా చూడాలి..
మలయ వైపు మరోసారి చూడాలంటే భయం వేస్తోంది.. కానీ, ఈమె ఖచ్చితంగా ఆమే అనిపిస్తోంది..
ఏదో మార్పు కనిపిస్తోంది. ఏంటా మార్పు? వయసు పెరిగినందుకా? లేక పచ్చటి రంగు, గులాబీరంగులోకి మారినందుకా? ఏదో మార్పు.. కళ్ళదాలు తీస్తే ఆ కళ్ళు చూసి తెలుసుకోవచ్చు ఆమేనా? ఎలా వచ్చింది ఇన్నేళ్ళ తరవాత .. విమల బంధువుగా ఇక్కడికి రావడం ఏంటి? ఈ వరసలేంటి? తనని గుర్తుపట్టలేదా? ఆమె మారింది కానీ, గుర్తు పట్టనంత మార్పు తనలో లేదు.. గుర్తు పట్టి ఉంటుంది .. కానీ, పట్టనట్టు నటిస్తోంది .. ఈమెకి తను విమల భర్త అని తెలుసా ..
https://kinige.com/book/Atithi
———–