పసునూరి రవీందర్ (Pasunoori Ravinder)

Share
పేరు (ఆంగ్లం)Pasunoori Ravinder
పేరు (తెలుగు)పసునూరి రవీందర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/08/1980
మరణం
పుట్టిన ఊరువరంగల్‌ జిల్లా
విద్యార్హతలుడాక్టరేట్‌
వృత్తిరచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు-మాదిగపొద్దు (2009) (సంపాదకత్వం)
-లడాయి (2010) (తెలంగాణ ఉద్యమ దీర్ఘకవిత, పలు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పేర్కొనబడిన కావ్యం)
-జాగో జగావో (2012) (సహ సంపాదకత్వం) (200మంది కవుల కవిత్వం వెలువడ్డ తెలంగాణ కీలక వచన కవితా సంకలనం)
-దిమ్మిస (2013) (సహ సంపాదకత్వం) వినిర్మాణ కవిత్వం)
-అవుటాఫ్ కవరేజ్ ఏరియా (2014) (తెలంగాణ రాష్ట్ర తొలి కథా సంపుటి), తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి యువ పురస్కారానికి ఎంపికైన కథా సంపుటి.
-అవుటాఫ్ కవరేజ్ ఏరియా (2015) (పునర్ముద్రణ)
-తెలంగాణ గేయ సాహిత్యం ప్రాదేశిక విమర్శ (2016) (తెలంగాణ ఉద్యమ పాటపై పరిశోధన గ్రంథం)
-ఒంటరి యుద్ధభూమి (2018) (కవిత్వం)
-గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ (2016) ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం)
ఇమ్మతి (సాహిత్య విమర్శ వ్యాస సంపుటి) (2018)
పోటెత్తిన పాట (గేయ సాహిత్య విమర్శ) (2018)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/book/Out+of+Coverage+Area,

http://www.anandbooks.com/Out-of-Coverage-Area

పొందిన బిరుదులు / అవార్డులు-కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం (2015) (తొలి తెలంగాణ రచయిత)

-యువశ్రీ (1998), యువశ్రీ కల్చరల్ ఆర్గనైజేషన్, వరంగల్

-సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం (2015) (తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ తేనా వారి పునర్జీవన గౌరవపురస్కారాలు-ఉత్తమ పరిశోధనగ్రంథ పురస్కారం)

-రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు (2015) (తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు)

-నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (2015) (యునైటెడ్ ఫోరం)

-ద‌ర‌సం పుర‌స్కారం (2017)

-న‌ట‌రాజ్ అకాడెమి ప్ర‌తిభా పుర‌స్కారం (2017)

-గిడుగు పుర‌స్కారం (2017)

సాహిత్య రత్న అవార్డ్ (భారతీయ దళిత సాహిత్య అకాడెమి) (2018)

కంకణాల జ్యోతి సాహిత్య రత్న అవార్డ్(2018)

జెన్నె మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం (2019)

వాయిస్ టుడే ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ లిటరరీ కాంట్రిబ్యూషన్ (2019)

జ్యోత్స్నా కళాపీఠం-ఉగాది కవితా పురస్కారం(2019)

జైనీ శకుంతల స్మారక కథా పురస్కారం (2019)

బి.ఎస్.రాములు స్ఫూర్తి పురస్కారం (2019)

లలిత కళాభిరామ పించము సాహిత్య అవార్డ్ (2019)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరచయిత భావజాలం
సంగ్రహ నమూనా రచనరచయిత పసునూరి రవీందర్ అంబేద్కరిస్టు. అంబేద్కర్ భావజాలంతో తాను సాహిత్య, సామాజిక రంగాలను పలుమార్లు విశ్లేషించి ఉన్నారు.

పసునూరి రవీందర్
రచయిత భావజాలం:

రచయిత పసునూరి రవీందర్ అంబేద్కరిస్టు. అంబేద్కర్ భావజాలంతో తాను సాహిత్య, సామాజిక రంగాలను పలుమార్లు విశ్లేషించి ఉన్నారు.

సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి పెట్టింది పేరైన వరంగల్‌ జిల్లా ఉద్యమాల నేపథ్యమే వారిని రాయడానికి పురిగొల్పింది. తాను పుట్టిన శివనగర్ ప్రాంతం కమ్యూనిస్టు ప్రభావం బలంగా ఉన్న ప్రాంతము. అలాంటి ప్రాంతంలో పుట్టడం వల్ల చిన్ననాటి నుంచి తనకు అభ్యుదయ భావజాలం, సామాజిక స్పృహ ఉంది. అందుకే మాదిగ కులంలో పుట్టిన తనను మార్క్సిస్టు దృష్టితో పనిచేయడానికి అది పురిగొల్పింది. అట్లా సుమారు 15 సంవత్సరాల పాటు విద్యార్థి సంఘాల్లో నాయకునిగా పనిచేశారు. ఆ తరువాత కాకతీయ యూనివర్సిటీతో పాటు, సెంట్రల్ యూనివర్సిటీలో పైచదువులు చదవడం వల్ల తనలో అస్తిత్వ స్పృహ బలపడింది. ఆయన తన మూలాల్లోకి వెళ్ళి తమ జాతులకు వేలయేండ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని చూసి గుండెరగిలి కవిగా, రచయితగా తనను తాను నిర్మించుకున్నారు. ఇదే సమయంలో రెండు ఉద్యమాలు తనను ఆలోచింప జేశాయి. అవి 1.దండోరా ఉద్యమం 2.తెలంగాణ ఉద్యమం. ఈరెండు ఉద్యమాలకు సంబంధించిన అనేక చర్చలు మిత్రులతో చేసిన తరువాత తన కార్యచరణను నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీలో అంబేద్కరిజం పరిచయంతో తన దృష్టి మరింత పటిష్ఠమైంది. అంటరాని జాతుల గురించి సామాజికంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ క్రమంలోనే గుర్తించారు. అదే సమయంలో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలు మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. తను చేసిన పరిశోధన కూడా ఇందుకోసం ఉపయోగపడింది అంటారు రవీందర్‌. ‘ప్రపంచీకరణ సాహిత్య విమర్శ‌’ మీద ఎంఫిల్‌ చేయడం వల్ల గ్రామాలు ధ్వంసం అవుతున్న తీరును ఆయా కులాలు, సాహిత్యకారులు అర్థం చేసుకుంటున్న తీరు, అవగతం చేసుకున్నారు. అలాగే తెలంగాణ పాట మీద పీహెడీ చేస్తున్నపడు తెలంగాణకు జరగిన అన్యాయాలు అవగతం చేస్కున్నారు. అందుకోసం సామాజికంగా పనిచేస్తూనే, సాహిత్యపరంగా అక్షరయుద్ధం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఈ క్రమంలోనే గడిచిన దశాబ్దకాలంగా కవిత్వం, కథ, పాట, విమర్శ వంటి ప్రక్రియల్లో తనదైన పద్ధతిలో రాస్తున్నారు. ఆయన రాసిన కథలన్ని కులపరంగా, ఆధునికంగా దళితులు ఇంకా ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించినవే.

తన మొదటి కథ 2002లో అచ్చైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన తన కథలు చదివిన వాళ్ళు “ఎందుకు ప్రతీసారి కులం గురించే రాస్తావ‌ని” హేళన చేస్తుంటారు, అయినా తనేం దాన్ని పట్టించుకోనని ఆయన అంటుంటారు. “ఎవరు అవునన్న కాదన్న ఈ దేశంలో కులం ఒక నగ్నసత్యం. కానీ, చాలా మంది ఆ కులం లేదని బుకాయిస్తుంటారు. వాస్తవ కులజాడ్యపు గుట్టును కప్పిపెట్టడంలో భాగస్వాములైనవాళ్లే ఆ పనికి పూనుకుంటారు. వాళ్లు బాధిత సమూహాల బాధను వినడానికి, చూడడానికి సిద్ధంగా ఉండరు. అందుకే నిజాలను నిర్భయంగా రాయాలి. సమాజాన్ని ఆలోచింపజేయాలి. ఈ ఉద్దేశ్యంతోనే నేను కథలు రాస్తున్న” అని అన్నారు. దళిత సాహిత్యోద్యమంలో దళిత కథ‌లు వచ్చాయి. కానీ, అవన్ని పూర్వ రూపానికి చెందిన‌ కుల వివక్షకు సంబంధించినవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. కులం తన రూపం మార్చుకొని మ‌రింత బ‌ల‌ప‌డింది. అయినా ఈ విషయం మనలో ఉన్న చాలా మందికి మింగుడు పడని విషయం. అందుకే తన రచనలు ఈ సమాజంలో ఉన్న దళితుల బాధలకు ఒక గొంతుకగా ఉపయోగపడితే చాలు అని తన నమ్మకం.

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B0%E0%B0%B5%E0%B1%80%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D

———–

You may also like...