పేరు (ఆంగ్లం) | Vempalli Gangadhar |
పేరు (తెలుగు) | వేంపల్లి గంగాధర్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | వైఎస్ఆర్ కడప జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత, కథకుడు, కవి, పరిశోధకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అంజన సిద్ధుడు,అంత ప్రవాహం,ఉరుసు,ఊరిని మర్సిపోగాకు రబ్బీ,ఊర్ధ్వపీడనం,దీపమాను ( సాహిత్య వ్యాసాలు ) మట్టి పొరల మధ్య మహా చరిత్ర ( చరిత్ర వ్యాసాలు ) సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం? – సంపాదకత్వం యురేనియం పల్లె ( నవల ) ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు-ప్రత్యేక రచన అనంతపురం చరిత్ర -సంపాదకత్వం రావణ వాహనం కథలు – (కథా సంపుటి ) పాపాఘ్ని కథలు – (కథా సంపుటి ) నేను చూసిన శాంతినికేతన్ (పర్యటన ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Dr-Vempalli-Gangadhar/s?rh=n%3A976389031%2Cp_27%3ADr.+Vempalli+Gangadhar, |
పొందిన బిరుదులు / అవార్డులు | సాహిత్య అకాడమీ యువ పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాపాగ్ని కథలు |
సంగ్రహ నమూనా రచన | ఇవి ఈ కాలం… సీమ కథలు. ఈ కాలం సీమ కథలు అనడం ఎందుకంటే ఇవి సమకాలీన రాయలసీమ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని పట్టి చూపుతున్నాయి. |
వేంపల్లి గంగాధర్
పాపాగ్ని కథలు
ఇవి ఈ కాలం… సీమ కథలు. ఈ కాలం సీమ కథలు అనడం ఎందుకంటే ఇవి సమకాలీన రాయలసీమ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని పట్టి చూపుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల క్షోభను, ఈ సీమలోకి ప్రజాసముదాయాల బాధలను మన ముందుంచుతున్నాయి. వార్తా దినపత్రికలో ప్రతి మంగళవారం 20 మే 2008 నుంచి 18 నవంబర్ 2009 వరకు వేంపల్లి గంగాధర్ రాసిన కాలం కథల నుంచి ఎంపిక చేసిన లఘు కథలు ఇవి.
ఈ కథల్లో కువైట్ ఇతర ప్రాంతాల వలసల బారిన పడిన కౌలురైతుల కల్లోలం మనకు కన్పిస్తుంది. నకిలీ పాస్ పోర్ట్ లు, ఏజెంట్, సబ్ ఏజెంట్ల మాయాజాలం ఒక వైపు, ఎయిడ్స్ బారిన పడిన తండా బిడికిలా అమ్మాయిల బాధలు, పెద్దోళ్ళ కింద నలిగిపోయే రజకుల కష్టాలు, నాణ్యతలేని విత్తనకాయలు, దక్కని ఎరువులు బారిన బడిన రైతుల గోడు, ప్రాజెక్టుల కింద పునరావాసం లభించని రైతులవ్యథలు మనల్ని వెంటాడుతాయి. ఇక్కడ ఈ సీమలో పంటల్లేవు, పైర్లులేవు, సాగునీరు లేదు. త్రాగు నీరు లేదు. కరెంటు లేదు. గొర్రెలకు దేశాటనం, పశువులకు కబేళాలు, ఇక ప్రభుత్వ పథకాల గుట్టును కూడా గంగాధర్ ఈ కథల్లో రట్టు చేశాడు.
———–