వెంకటేశ్వర రావు దార్ల (Venkateswara Rao Darla)

Share
పేరు (ఆంగ్లం)Venkateswara Rao Darla
పేరు (తెలుగు)వెంకటేశ్వర రావు దార్ల
కలం పేరుదార్ల, భావన
తల్లిపేరుశ్రీమతి పెదనాగమ్మ.
తండ్రి పేరుశ్రీ లంకయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం09/05/1973
పుట్టిన ఊరుఅమలాపురం
విద్యార్హతలుఎం.ఫిల్,. పిహెచ్.డి
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమాదిగ చైతన్యం 1997 – ( కవితా సంకలనం – ఉప సంపాదకత్వం)
సాహితీ మూర్తుల ప్రశస్తి 1997 – ( సహాయ సంకలన కర్త )
డా. యస్. టి. జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి పరిశీలన 1999 – (పరిశోధన గ్రంథం ) దళిత తాత్త్వికుడు2004 – (కవితా సంపుటి)
సృజనాత్మక రచనలు చేయడం ఎలా? 2005-(అనువర్తిత విమర్శ)
సాహితీ సులోచనం (పుస్తక సమీక్షా వ్యాసాలు) 2006
ఒక మాదిగ స్మృతి _ నాగప్పగారి సుందర్రాజు పరిచయం2007 – ( మోనోగ్రాఫ్)
దళిత సాహిత్యం మాదిగ దృక్పథం2008 – (సాహిత్య విమర్శ )
వీచిక 2009 – ( సాహిత్య విమర్శ )
పునర్మూల్యాంకనం 2010 -(సాహిత్య విమర్శ,)
బహుజన సాహిత్య దృక్పథం 2012 – (సాహిత్య విమర్శ)
సాహితీమూర్తులు-స్ఫూర్తులు 2015 -(సాహిత్య విమర్శ)
నెమలి కన్నులు 2016 – (వచన కవిత్వం)
సాహితీ సౌగంధి 2016 – (పీఠికలు)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/author/Dr.+Darla+Venkateswara+Rao,

https://www.amazon.co.uk/Books-Dr-Darla-

పొందిన బిరుదులు / అవార్డులుభారతీయ సాహిత్య పరిషత్,డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం, ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం, మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం,కీర్తి పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసాహితీమూర్తులు – స్ఫూర్తులు
సంగ్రహ నమూనా రచనసమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు ప్రతిస్పందించే కవులు, రచయితలు తమ అనుభవాలను, అనుభూతులను, తమ ఆలోచనలను తమకిష్టమైన ప్రక్రియలో అభివ్యక్తీకరిస్తుంటారు.

వెంకటేశ్వర రావు దార్ల

సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు ప్రతిస్పందించే కవులు, రచయితలు తమ అనుభవాలను, అనుభూతులను, తమ ఆలోచనలను తమకిష్టమైన ప్రక్రియలో అభివ్యక్తీకరిస్తుంటారు. వాటిలో వ్యక్తమైన ఆలోచనలు సమకాలీన సమాజానికి మార్గదర్శనం చేస్తే, మరికొన్ని ఆలోచనలు ప్రజల్ని తర్వాత కాలంలోనూ ప్రభావితం చేయవచ్చు. ఈ దృష్టితో తెలుగు సాహితీమూర్తుల కృషిని గమనిస్తే భిన్న మనస్తత్వాలతో కనిపిస్తారు. తాము పుట్టి పెరిగిన వాతావరణానికి అనుగుణంగానే తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్నవాళ్ళు కొందరైతే, దానికి భిన్నంగా ఆలోచించి, జీవించిన వాళ్ళు మరికొందరున్నారు. సాహిత్యమే ఊపిరిగా బతుకుతూ అనేక ప్రయోగాలు చేసి నూతనత్వానికి మార్గం వేసినవాళ్ళున్నారు. తమ వృత్తి వేరైనా, ప్రవృత్తిగా మొదలైన రచనావ్యాసాంగం ఆ తర్వాత కాలంలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

కొంతమంది వ్యక్తులుగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటే, మరికొంతమంది వారి భావాల ప్రభావం మనపై విస్తృతంగా కనిపిస్తుంది. ఇది ఇలాంటి వ్యక్తుల గురించి వివిధ సందర్భాల్లో రాసిన పరిశోధన పత్రాలు, వ్యాసాల్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంతో వెలువడుతున్నదీ పుస్తకం. సమాజాన్నీ, సాహిత్యాన్ని తమదైన దృష్టికోణంతో పరిశీలించే పద్ధతినీ, కావ్యపరమార్థాన్ని అవగాహన చేసుకునే విధానాన్ని పరిశోధకులు, విమర్శకులు, విద్యార్థులు గమనించడానికి ఈ వ్యాసాలు ఉపకరిస్తాయనుకుంటున్నాను.

https://kinige.com/book/Saahitimoorthulu+Spoorthulu

———–

You may also like...