మహమ్మద్ ఖదీర్బాబు (Mohammed Khadeerbabu)

Share
పేరు (ఆంగ్లం)Mohammed Khadeerbabu
పేరు (తెలుగు)మహమ్మద్ ఖదీర్బాబు
కలం పేరుఖదీర్ బాబు
తల్లిపేరుసర్తాజ్ బేగం
తండ్రి పేరుమహమ్మద్ కరీంసాహెబ్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ04/28/1972
మరణం
పుట్టిన ఊరునెల్లూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తిపాత్రికేయుడు
రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమొదటి కథ ‘ పుష్పగుచ్ఛం’ ను 1995 లో వ్రాసారు,దర్గామిట్ట కతలు,పోలేరమ్మబండ కతలు,పప్పుజాన్ కథలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.amazon.in/Books-Babu-Mohammed-Khadeer/s?

https://www.logili.com/home/search?q=Mohammed%20Khadeer%20Babu

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనూరేళ్ళ తెలుగు కథ
సంగ్రహ నమూనా రచనహిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు.

మహమ్మద్ ఖదీర్బాబు

హిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు. కాని- దారిన పోతూ పోతూ కింద రాలిన ఒక గన్నేరు పువ్వును అందుకొని దేవుని సమక్షాన పెట్టి అంతకు మించి వీలు కాదన్నట్టుగా కదిలిపోతారు మరికొందరు. ఇది అలాంటి ప్రయత్నం. తెలుగు కథ సమక్షంలో ఒక గన్నేరు పువ్వును పెట్టే ప్రయత్నం. వందేళ్ళలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొత్తాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని ఈ అడావిడి రోజుల్లో నూరేళ్ళ తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. కొండను అద్దంలో చూపించడం. దేశీయ కథా సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం బహుశా కొత్త. ఇది తెలుగు కథ ఘనత. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత.

 

https://www.amazon.in/Noorella-Telugu-katha-Mohammed-Khadeer/dp/8194118077/ref=sr_1_1?

———–

You may also like...