పి.సి. నరసింహా రెడ్డి (P.C Narasimha Reddy)

Share
పేరు (ఆంగ్లం)P.C Narasimha Reddy
పేరు (తెలుగు)పి.సి. నరసింహా రెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1943
మరణం2020
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

పి.సి. నరసింహా రెడ్డి

పెంచుకలపాడు చిన నరసింహారెడ్డి (1943-2020), పి సి నరసింహారెడ్డిగా, పి సి ఎన్ గా, శుక్తి గా, ఐ గా 1960ల మధ్య నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా కవిగా, అధ్యాపకుడిగా, రచయితగా, చిత్రకారుడిగా విస్తృతమైన కృషి చేసిన మంచి మనిషి. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా పని చేశారు. గద్వాల దగ్గరి గ్రామం నుంచి 1960లలో హైదరాబాదుకు చదువుకు వచ్చి, రాత్రి కవితా సంకలనంతో, దిగంబరకవులతో, వరవరరావుతో సన్నిహితంగా ఉన్నారు. సృజన కూ, సృజన ప్రచురణలకూ (నవీన్ అంపశయ్య, సివి కృష్ణారావు మాదీ మీ ఊరే మహరాజకుమారా, పింగళి రంగారావు వినడానికో కథ), తొలిరోజుల విరసం పుస్తకాలకూ ముఖచిత్ర రచన చేశారు. గీతల్లో గొప్ప దృశ్యాలు చిత్రించేవారు. భాషా శాస్త్రంలో, సాహిత్యంలో అపారమైన కృషి చేశారు. మేం అల్లం రాజయ్య కొలిమంటుకున్నది పుస్తకంగా తెచ్చినప్పుడు 1979లో శ్రవ్యనవల అని చివరి మాటతో ఒక కొత్త ప్రక్రియను ఆవిష్కరించి, దానికి తగిన సాహిత్య విమర్శ రాశారు. నలబై సంవత్సరాలుగా ఆయనతో ఎన్నో సార్లు సంభాషించాను.  వరవరరావు గారి మీద అపారమైన ప్రేమ. విప్లవ సాహిత్యం మీద, విప్లవోద్యమం మీద ప్రేమ.

———–

You may also like...