పేరు (ఆంగ్లం) | Chalapaka Prakash |
పేరు (తెలుగు) | చలపాక ప్రకాష్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 06/09/1971 |
మరణం | – |
పుట్టిన ఊరు | విజయవాడ |
విద్యార్హతలు | ఎం.ఎ |
వృత్తి | తెలుగు రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మూడోకన్ను (కవిత్వం) : ఇందులో పలు కవితలు చాలా పత్రికలలో ప్రచురింపబడినవే. ఇందులో మొత్తం 98 కవితలున్నాయి. ఈ కాలమ్ కథలు : ప్రేమాభిమానాలు చలపాక నానీలు మూడు ముక్కలాట జీవితం (కథల సంపుటి) హాస్యాభిషేకం చలపాక ప్రకాష్ కార్టూన్లు-2 చూపు ప్రళయం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నవ్య కవితా రూపం – నానీలు |
సంగ్రహ నమూనా రచన | 1997 సంవత్సరంలో ‘వార్త’ ఆదివారం అనుబంధం ద్వారా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రక్రియగా పురుడు పోసుకున్న ఈ ‘నానీ’, తెలుగింట బుడతడుగా అల్లరి చేసి, తదుపరి ‘నానీ-నీవి-మనవి’ అని నిర్వచించిన ‘నానీ’ సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి అనుభూతుల పరవళ్ళుగా దశదిశలా పరివ్యాప్తి చెందాయి. |
చలపాక ప్రకాష్
1997 సంవత్సరంలో ‘వార్త’ ఆదివారం అనుబంధం ద్వారా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రక్రియగా పురుడు పోసుకున్న ఈ ‘నానీ’, తెలుగింట బుడతడుగా అల్లరి చేసి, తదుపరి ‘నానీ-నీవి-మనవి’ అని నిర్వచించిన ‘నానీ’ సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి అనుభూతుల పరవళ్ళుగా దశదిశలా పరివ్యాప్తి చెందాయి. ఒక్కరితో ప్రారంభమైన ఈ నాలుగుపాదాల నానీ, నలుదిక్కులా నవఉద్యమ కవితాశక్తిగా ఎదిగి, ఈ రోజు తెలుగు పాఠకుల హృదయాలలో నవ్య కవితా ప్రక్రియగా సుస్థిరస్ధానాన్ని పొందగలిగింది. వర్ధమాన యువకవులను సైతం ఈ ప్రక్రియ చేపట్టి ఈనాడు నవతరం కవులుగా తీర్చిదిద్దే ప్రసిద్ధ సాధనంగా ఎదుగుతోంది. ఇంతమంది కవులను, పాఠకులను ఈ ప్రక్రియ ఎందుకింతగా ఆకట్టుకోగలిగిందంటే కారణం ప్రధానంగా కాలానికి తగ్గ సమకాలీనతను పుణికిపుచ్చుకోవటం, తక్కువ నిడివిలో ఎక్కువ భావాన్ని ప్రతిఫలింపచేసే లక్షణం కలిగివుండటం, ముఖ్య భూమికను పోషిస్తుండగా సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో, భావం వ్యక్తీకరించే తీరులో ప్రత్యేకతను కలిగివుండటం పలువుర్నీ ఆకర్షించే గుణం ‘నానీ’లో ప్రస్ఫుటమవుతోంది.
ఈ ‘నానీ’ ప్రక్రియ ఇతర తెలుగు కవితా ప్రక్రియశాఖల్లో భిన్నత్వం కలిగి వుండటానికి ప్రధాన లక్షణం ‘వస్తువైవిధ్యం’లో బలమైన పునాదిని రూపొందించుకోవటం, వస్తువు రూపురేఖలలో తనదైన భావశైలీ, వస్తు నిర్మాణంలో ఒకవిధమైన ధారాశక్తి, గాఢత, సాంద్రతతో ఒక ఉప్పెనగా ఎగిసిపే ఉదాత్తగుణం దీనిలో స్పష్టంగా, సూటిగా పాఠకుడి హృదయాలలో తిష్ట వేసుకో గలుగుతున్నది.
ఈ నానీ కవులు చూపిన వస్తు వైవిధ్యం, వివిధ భావపరంపరల కవితా శక్తిని అంచనా వేసే ప్రయత్నానికి ఈ తూకపు రాళ్ళు చాలవేమోననిపిస్తుంది. అయితే నాలుగు పాదాలలో పొందికగా కూర్చున్న ‘నానీ’-లాగే ఈ తూకపు కొలతలో కొన్ని మెచ్చతగ్గ నానీలను ఎన్నుకొని పత్ర సమర్పణ చేస్తున్నాను.
https://kinige.com/book/Navya+Kavitha+Rupam+Naneelu
———–