| పేరు (ఆంగ్లం) | Baba Bolloju |
| పేరు (తెలుగు) | బాబా బొల్లోజు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | అమ్మాజీ |
| తండ్రి పేరు | బసవలింగం |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/15/1970 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | యానాం |
| విద్యార్హతలు | ఎం.యస్సీ, ఎం.ఫిల్ |
| వృత్తి | అధ్యాపకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువాదం,గాథాసప్తశతి – కొన్ని అనువాదాలు, వివిధ పుస్తకాలకు వ్రాసిన సుమారు వందకు పైన సమీక్షా వ్యాసాలు, వివిధ ప్రపంచకవుల రెండువందలకు పైన కవితల అనువాదాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆకుపచ్చని తడిగీతం పుస్తకానికి శ్రీ శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010,పాలకొల్లుకు చెందిన శ్రీకళాలయ సాంస్కృతిక సంస్థవారిచే రాష్ట్రస్థాయి సాహితీపురస్కారం -2012 శ్రీ ర్యాలి ప్రసాద్- డా.సోమసుందర్ స్మారక పురస్కారం 2016 ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017 రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018 |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వెలుతురు తెర |
| సంగ్రహ నమూనా రచన | చెట్టునీడలో కూర్చొన్న విద్యార్దుల గుంపు వెలుతురు తెరలో దూకి వైఫై సముద్రంలో తేలింది. |
బాబా బొల్లోజు
చెట్టునీడలో కూర్చొన్న
విద్యార్దుల గుంపు
వెలుతురు తెరలో దూకి
వైఫై సముద్రంలో తేలింది.
దారాన్ని స్రవించుకొని
కాళ్లతో పేనుకొంటూ తనచుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్ధీ తనచుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకొన్నాడు.
వైఫై లింక్ తెగింది
ఓహ్! షిట్…..
గూడులోంచి సీతాకోక చిలుక
మెత్త మెత్తగా బయటపడినట్లుగా
ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి
మెల మెల్లగా మేల్కొన్నాడు.
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కలల్లార్చుకొంటూ ఎగురుతో!
https://kinige.com/book/Veluturu+Tera
———–