| పేరు (ఆంగ్లం) | Afsar |
| పేరు (తెలుగు) | అఫ్సర్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | మునవర్ బేగం |
| తండ్రి పేరు | షంషుద్దీన్ |
| జీవిత భాగస్వామి పేరు | కల్పనా రెంటాల |
| పుట్టినతేదీ | 04/11/1964 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | పి.హెచ్.డి |
| వృత్తి | సీనియర్ ఉపన్యాసకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | రక్తస్పర్శ (1986) ఇవాళ (1991) ఆధునికత – అత్యాధునికత (1992) వలస (2002) కథ – స్థానికత (2008) ఊరి చివర (2009) The Festival of Pirs (2013) (ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణ) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Afsar-Kavitvam-Appati-Nunchi-Ippati/dp/B083BF46J2 |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1992 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు 1992 ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు 1999 అలిశెట్టి ప్రభాకర్ అవార్డు 2002 తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శకుడు పురస్కారం 2002 మద్రాస్ తెలుగు అకాడెమీ వారి ఉగాది పురస్కారం 2003 సాహితీ గౌతమి అవార్డు 2007 భారత ప్రభుత్వంచే సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డు 2002 భారతప్రభుత్వ సాంస్కృతిక మానవ వనరుల మంత్రిత్వశాఖచే ఫెలోషిప్ 2006 అమెరికన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ వారిచే సీనియర్ ఫెలోషిప్ |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నాలుగు మాటలు |
| సంగ్రహ నమూనా రచన | ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి చిత్తుపదాలమధ్య వొకానొక భావావశేషం మంచుపర్వతంలా – |
అఫ్సర్
ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి
చిత్తుపదాలమధ్య
వొకానొక భావావశేషం
మంచుపర్వతంలా –
ఎప్పటికీపగలని మంచులో
కూరుకుపోయిన పదసమూహాన్ని నేను.
తలుపులు
మూతపడి వున్నాయి పెదవుల్లా.
సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు
వేళ్ళు తెగిపోయాయి
తలుపుతట్టలేను
శవపేటికకు ప్రాణం పోయాలా?
అదృష్టవంతులు కొందరు,
మాటలమీదే మళ్ళీమళ్ళీ బతుకుతుంటారు
మాటలకే రక్తాన్ని అద్దుతుంటారు
రక్తాన్ని నమ్ముకున్నవాణ్ణి
వొట్టిదేహాన్నిమాత్రం అమ్ముకోలేను. …
(వలస నుంచి)
———–