పేరు (ఆంగ్లం) | Annavaram Devender |
పేరు (తెలుగు) | అన్నవరం దేవేందర్ |
కలం పేరు | – |
తల్లిపేరు | కేదారమ్మ |
తండ్రి పేరు | దశరథం |
జీవిత భాగస్వామి పేరు | రాజేశ్వరి |
పుట్టినతేదీ | 10/17/1962 |
మరణం | – |
పుట్టిన ఊరు | సిద్దిపేట జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తొవ్వ (2001) నడక (2003) మంకమ్మ తోట లేబర్ అడ్డా (2005) బుడ్డపర్కలు (నానీలు-2006) బొడ్డు మల్లె చెట్టు (2008) పొద్దు పొడుపు (2011) కరువు (2013) పొక్కిలి వాకిళ్ల పులకరింత (2014) బువ్వ కుండ (దీర్ఘ కవిత-2016) ఇంటి దీపం (2016) వరి గొలుసులు (2018) వ్యాసాలు* మరో కోణం (2003) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Annavaram+Devender |
పొందిన బిరుదులు / అవార్డులు | మహాత్మ జ్యోతిభా పూలే ఫెలోషిప్ (2001) రంజని-కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2004) డా. మలయశ్రీ సాహితీ పురస్కారం (2006) అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం (2013) కవయిత్రి మొల్ల పురస్కారం (2013) కలహంస పురస్కారం (2013) అక్షరశిల్పి పురస్కారం (పొద్దుపొడుపు కవితా సంకలనం) వీరు రాసిన కాలమ్స్(శీర్షిక)* తెలంగాణ మాస పత్రికలో – ఎన్నిల ఎలుగు నమస్తే తెలంగాణ లో – ఊరి దస్తూరి మన తెలంగాణ లో – హరివిల్లు వివిధ పత్రికలలో – భాతఖాని ; మరో కోణం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బువ్వ కుండ |
సంగ్రహ నమూనా రచన | అది బువ్వకుండ ఆకాశంలోని శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి…… |
అన్నవరం దేవేందర్
అది బువ్వకుండ
ఆకాశంలోని శూన్యాన్ని
ముక్కలు ముక్కలుగా కత్తిరించి
సుట్టువార మట్టిగోడలు కట్టి
సృష్టించిన గుండెకాయ
ఆహార తయారీకి ఆయువు
జీవన వికాసానికి తొలి పనిముట్టు
మానవ యానానికి అడుగు
ఎప్పటికి అస్తమించని సూర్య మడుగు
అన్నం వండే బువ్వకుండ
అందరికీ ఆదిమతల్లి
కూర అటికనే ఆదిశక్తి
మంచిల్ల పట్వ దూప తీర్చే సల్వ
మన్నులో మట్టిని కనిపెట్టి
కసపిస మెత్తంగ తొక్కి
సారె మీద కుంభాకృతిగ చేయడం
నాగరికతకే తొలి ఇత్తనం
తొలి వంటకూ అంకురార్పణం
ఇది మానవ జాతికే సమర్పణం
https://kinige.com/book/Buvva+Kunda
———–