పేరు (ఆంగ్లం) | Surya Bhaskar Makineedi |
పేరు (తెలుగు) | సూర్య భాస్కర్ మాకినీడి |
కలం పేరు | – |
తల్లిపేరు | సరస్వతి |
తండ్రి పేరు | మాకినీడి శ్రీరంగనాయకులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/16/1952 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://telugueminentpersons.blogspot.com |
స్వీయ రచనలు | ఆమె |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Makineedi+Surya+Bhaskar, |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆమె – మాకినీడి సూర్య భాస్కర్ |
సంగ్రహ నమూనా రచన | పుట్టక ముందే… అస్తిత్వం బట్ట కట్టక ముందే అంతమయ్యేదేది? ఆమ్నియో సెంటెసిస్ జోస్యమేమిటి? |
సూర్య భాస్కర్ మాకినీడి
పుట్టక ముందే…
అస్తిత్వం బట్ట కట్టక ముందే
అంతమయ్యేదేది?
ఆమ్నియో సెంటెసిస్ జోస్యమేమిటి?
స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి, ఎదుగుదలకు
‘మూడు ముళ్ళు’ పడ్డాకా…
మరి ఎత్తడం కుదరదు!
బల్లి నోట్లోంచి జారిపడ్డ పురుగులా
లోనుంచి వస్తున్న స్ట్రెచర్ మీద
జన్మ నిచ్చి, మరో జన్మను పొందిన మూర్తి!
క్షీరామృత మాతృత్వపు దీప్తి!!
ఉమ్మడాస్తిగా
బూజులు పట్టిన మండువా…
గాజులు చిట్లిన ఆమె!
ఆమె నీడ మృత్యు పీడ!
ముసలి గుండె కోత…
నిశ్శేషపు బ్రతుకు తీసివేత!!
దేహ ప్రమిదలో జీవన తైలం తగ్గుతూ
ప్రాణ దీపం మిణుక్కుమంటో!!!
———–