| పేరు (ఆంగ్లం) | Venkateswara Prasadraju Rallabandi |
| పేరు (తెలుగు) | వెంకటేశ్వర ప్రసాదరాజు రాళ్లబండి |
| కలం పేరు | కవితాప్రసాద్ |
| తల్లిపేరు | రత్నవర్ధనమ్మ |
| తండ్రి పేరు | కోటేశ్వర రాజు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1961, మే 21 |
| మరణం | 2015, మార్చి 15 |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామం |
| విద్యార్హతలు | పి.హెచ్.డి. |
| వృత్తి | అవధాని, కవి గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అగ్నిహంస ఒంటరి పూలబుట్ట దోసిట్లో భూమండలం కాదంబిని సప్తగిరిధామ శతకం పద్యమండపం ఇది కవిసమయం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
వెంకటేశ్వర ప్రసాదరాజు రాళ్లబండి
అవధానాలలో పూరణలు
ఇతడు చేసిన అవధానాలలో కొన్ని పూరణలు మచ్చుకు –
1. సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!
పూరణ:
జాతికి దారిచూపి, దృఢసత్త్వము నిచ్చి, మనస్సు నందునన్
భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత,దు
ర్నీతులబద్ధమిద్దియని నిందలతో పరిహాసమాడినన్
గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!
2. సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
పూరణ:
భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
3. సమస్య: గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!
పూరణ:
గురువుల చిత్రమొక్కటి అకుంఠిత రీతిని వ్రాసి దానిలో
మరచెను పంగనామములు, మానితమైన ప్రదర్శనంబునం
దరసినవారు దోషము తామయి చూపకముందె, తానుగా
గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!
———–