| పేరు (ఆంగ్లం) | Mandarapu Hymavathi |
| పేరు (తెలుగు) | మందరపు హైమవతి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | మందరపు దుర్గాంబ |
| తండ్రి పేరు | మందరపు కాసులు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 02/18/1956 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విజయవాడ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | కవయిత్రి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వానచినుకులు నిషిద్ధాక్షరి సూర్యుడు తప్పిపోయాడు నీలిమేఘాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/literature/neeligorinta-mandarapu-hymavathi/p-7488847-69624643994-cat.html |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అనాసక్త సాయంత్రం |
| సంగ్రహ నమూనా రచన | ఏ అందమైన మేఘాల లిపి లేని అనుత్సాహకరమైన ఒకలాంటి బూడిద రంగు ఆకాశ నేపధ్యంలో దిగులు చీకటి ముసిరినట్లు గుబులు గుబులుగా మనసు…… |
మందరపు హైమవతి
ఏ అందమైన మేఘాల లిపి లేని
అనుత్సాహకరమైన
ఒకలాంటి బూడిద రంగు
ఆకాశ నేపధ్యంలో
దిగులు చీకటి ముసిరినట్లు
గుబులు గుబులుగా మనసు
పూర్తిగా సాయం సమయం కాకుండానే
కొడిగట్టిన దీపంలా
ఎఱ్ఱమందారంలా
అతి సాధుస్వభావిలా
అతి చల్లని సూరీడు
నాలుగు వైపులూ మూసుకుపోయిన
నల్లరంగు విషాదపు తెరల గుడారంలో
బిక్కుబిక్కుమంటూ
ఒక్కదానే్న వున్న భావన
ఎన్నో పనుల ఒత్తిడివున్నా
ఏ పనీ చేయబుద్ధి పుట్టని
అనాసక్త సాయంత్రం
కిటికీలు తలుపులు బిగించి
బద్ధకపు దుప్పటి కప్పుకొని
వెచ్చని కలలు కంటూ
పడుకొంటే ఎంత బాగుండు
ఈ చలి సంజలో…
———–