పేరు (ఆంగ్లం) | Mullapudi Venkata Ramana |
పేరు (తెలుగు) | ముళ్ళపూడి వెంకట రమణ |
కలం పేరు | ముళ్ళపూడి వెంకటరావు |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | సింహాచలం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 06/28/1921 |
మరణం | 2/24/2011 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బుడుగు – చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన ఋణానందలహరి (అప్పుల అప్పారావు – అప్పుల ప్రహసనం విక్రమార్కుని మార్కు సింహాసనం – సినీ మాయాలోక చిత్ర విచిత్రం గిరీశం లెక్చర్లు – సినిమాలపై సెటైర్లు రాజకీయ బేతాళ పంచవింశతి – రాజకీయ చదరంగం గురించి ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Mullapudi-Venkata-Ramana/s? |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కనుక |
సంగ్రహ నమూనా రచన | అడుగుజాడ గురజాడది కనుక ఆధునిక రచయితలముందరం అప్పారావుగారి దగ్గర్నుంచే అభ్యుదయభావాలు పెంచుకోవడం మొదలెట్టాం. |
ముళ్ళపూడి వెంకట రమణ
అడుగుజాడ గురజాడది కనుక ఆధునిక రచయితలముందరం అప్పారావుగారి దగ్గర్నుంచే అభ్యుదయభావాలు పెంచుకోవడం మొదలెట్టాం. అప్పారావుగారి మంచితోపాటు వారి హాస్యానికికూడా వారసత్వాన్ని ప్రకటించుకున్న ఒకానొకడు బహుశా ఒకడే ఒకడు, ముళ్ళపూడి వెంకటరమణ మాత్రమే.
సులభంగా రాయడం అలవర్చుకోడం ఎంత కష్టమో , సున్నితమైన హాస్యంతో జీవితాన్ని రంగరించడంకూడా అంతకష్టమే. “ఆద్యంతం నవ్వు తొణికిసలాడేటట్టు గంభీరమైన ఇతివృత్తాన్ని నడిపించడం అంత తేలికైన విషయం కాదు” అని అప్పారావుగారు ఒక సారి హెచ్చరించారు. ఈ సంగతి ముళ్ళపూడి వెంకటరమణకు స్వానుభవమే. లోపల ఎంత బడబాగ్ని ఉన్న సముద్రజలాలు శీతలలు. చేదు సత్యాలకు మంచి నవ్వుల పంచదారపాకం పట్టించడం ఆ సత్యాలను అయినవాళ్ళచేత తినిపించాలి తాపత్రయపడేవారికి చాల అవసరం.
———–