| పేరు (ఆంగ్లం) | Mudigonda Sivaprasad |
| పేరు (తెలుగు) | ముదిగొండ శివప్రసాద్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | రాజేశ్వరమ్మ |
| తండ్రి పేరు | మల్లికార్జునరావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/23/1940 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా |
| విద్యార్హతలు | పి.హెచ్.డి. |
| వృత్తి | అధ్యాపకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శ్రీపదార్చన ఆవాహన పట్టాభి రెసిడెన్సీ శ్రీలేఖ శ్రావణి వంశధార తంజావూరు విజయం మహాసర్గ బసవగీత సమ్రాట్ పుష్యమిత్ర సగం విరిగిన చంద్రుడు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/home/search? |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | శ్రీ లేఖ |
| సంగ్రహ నమూనా రచన | “ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ. |
ముదిగొండ శివప్రసాద్
“ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ.
“ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?”
“అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది.”
“ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి”
“రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.
———–