| పేరు (ఆంగ్లం) | Ismail |
| పేరు (తెలుగు) | ఇస్మాయిల్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 05/26/1928 |
| మరణం | 11/25/2003 |
| పుట్టిన ఊరు | నెల్లూరు |
| విద్యార్హతలు | బి.ఏ. (ఆనర్స్) |
| వృత్తి | అధ్యాపకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://ismailmitramandali.blogspot.com/ |
| స్వీయ రచనలు | మృత్యువృక్షం (1976) చిలకలు వాలిన చెట్టు (1980) చెట్టు నా ఆదర్శం (1982) రాత్రి వచ్చిన రహస్యపు వాన (1987) బాల్చీలో చంద్రోదయం కప్పల నిశ్శబ్దం (హైకూలు) రెండో ప్రతిపాదన కవిత్వంలో నిశ్శబ్దం (1990) (విమర్శ) కరుణముఖ్యం (విమర్శావ్యాసాలు) పల్లెలో మా పాతయిల్లు (మరణానంతరం అభిమానులు తీసుకువచ్చిన కవితాసంకలనం) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | మోహానికీ మోహరానికీ రవంతే తేడా. |
ఇస్మాయిల్
మోహానికీ
మోహరానికీ
రవంతే తేడా.
ప్రేమికుడికీ
సైనికుడికీ
ఒకటే ఏకాగ్రత!
ప్రియుడి కంటికొసని
ప్రేయసి నిత్యం జ్వలిస్తే
జవాను తుపాకి తుదని
శత్రువు నిశ్చలంగా నిలుస్తాడు.
స్మరరంగంలో లేచే సుడిగాలే
సమరరంగంలో పిడికిలి బిగిస్తుంది.
కోరికల తుఫానుకి
కొంకర్లు తిరిగే నరాలచెట్టులా
సంకుల సమరంలో
వంకర్లుపోయిన ముళ్ళకంచెలూ మెషీన్గన్లూ.
మృత్యుభంగిమలకి
రత్యంతభంగిమలకి
వ్యత్యాసం ఉందంటారా?
ఉవ్వెత్తుగా లేచిపడి
ఉద్రేకపు చివర్ల
బిగుసుకునే దేహాలకి కారణం
భావప్రాప్తా, అభావమా?
ఐతే,
బుద్ధిగా ప్రేమించుకోక
యుద్ధాలెందుకు చేస్తారో
నాకర్థం కాదు.
———–