పేరు (ఆంగ్లం) | Gunturu Seshendra Sarma |
పేరు (తెలుగు) | గుంటూరు శేషేంద్ర శర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | అమ్మాయమ్మ |
తండ్రి పేరు | సుబ్రహ్మణ్య శర్మ |
జీవిత భాగస్వామి పేరు | జానకి |
పుట్టినతేదీ | 10/20/1927 |
మరణం | 05/30/2007 |
పుట్టిన ఊరు | నెల్లూరు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://seshendrasharma.weebly.com/ |
స్వీయ రచనలు | 1951 – “సోహ్రాబ్ – రుస్తుమ్” అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి) 1968-72 – శేషజ్యోత్స్న – కవిత, వచన రచనల సంకలనం 1974 – మండే సూర్యుడు 1974 – రక్తరేఖ 1975 – నా దేశం – నా ప్రజలు 1976 – నీరై పారిపోయింది 1977 – గొరిల్లా నరుడు – నక్షత్రాలు షోడశి – రామాయణ రహస్యములు స్వర్ణ హంస ఆధునిక మహాభారతం జనవంశం కాలరేఖ కవిసేన మేనిఫెస్టో మబ్బుల్లో దర్బార్… 1968 – సాహిత్య కౌముది ఋతు ఘోష ప్రేమ లేఖలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/poetry/janavamsham-seshendra-sharma/p-7488847-38011206566-cat.html#variant_id=7488847-38011206566,https://www.logili.com/history-politics/kavisena-manifesto-seshendra/p-7488847-22157873148-cat.html#variant_id=7488847-22157873148 |
పొందిన బిరుదులు / అవార్డులు | 1993 – సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం శేషేంద్ర రచించిన కాలరేఖకు 1994 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం 1994 – తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కవిసెనా మేనిఫెస్టో |
సంగ్రహ నమూనా రచన | కవితానుభూతి ప్రేక్షకుల స్థాయికి అందనప్పుడు, అది నిరర్థకం కాక తప్పదనే ఆవేదన వీరిలో ఉంది. ఆఫ్రికా అడవుల్లో పచ్చలు, వజ్రాలు పొదిగిన అందమైన అంగుళీయకం పడవేసినా, అక్కడి జనులు దాన్ని తాకనైనా తాకకుండా తొక్కుతూ పోయినట్లు. |
గుంటూరు శేషేంద్ర శర్మ
కవితానుభూతి ప్రేక్షకుల స్థాయికి అందనప్పుడు, అది నిరర్థకం కాక తప్పదనే ఆవేదన వీరిలో ఉంది. ఆఫ్రికా అడవుల్లో పచ్చలు, వజ్రాలు పొదిగిన అందమైన అంగుళీయకం పడవేసినా, అక్కడి జనులు దాన్ని తాకనైనా తాకకుండా తొక్కుతూ పోయినట్లు. అందమైన కవిత్వం సైతం స్పందన లేనివారి సమక్షంలో ఎందుకూ కొరగాకుండా పోతుందంటారు. కవిత్వం మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేయాలని, కవిత్వం తన శక్తితో మనిషిలో ఆశాజ్యోతిని ఆరనీయకుండా చూడాలని శేషేంద్ర సంకల్పించారు. అందుకే ఆయన – “జీవితం ఒక మహాసముద్రం కావచ్చు కాని, ఆశ అనే నావతో దాన్ని దాటేయోచ్చు” అంటారు.
ఎంత అయోమయంగా రాస్తే అంత గొప్ప వచన కవిత అనే ధోరణిని ఆయన నిరసించారు. యూరోపియన్ కవుల కవితాత్మను పూర్తిగా అవగాహన చేసుకోకుండా కేవలం ఉపరితల పరిశీలనతో అనుకరణలు సృష్టించవద్దంటారు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం భారతజాతికి ఎనలేని మేలు చేసిందనే వాదనను శేషేంద్ర అంగీకరించలేదు.
———–