వాసా ప్రభావతి (Vasa Prabhavathi)

Share
పేరు (ఆంగ్లం)Vasa Prabhavathi
పేరు (తెలుగు)వాసా ప్రభావతి
కలం పేరు
తల్లిపేరులక్ష్మీ సోమిదేవమ్మ
తండ్రి పేరుకాశీచయనుల సూర్యనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం12/18/2019
పుట్టిన ఊరుఆత్రేయపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంగడి వినోదం
అందని వసంతం
అంధకారంలో…
అచ్చమ్మకల
అనసూయ లేచిపోయింది
ఆప్యాయత నడుమ…
ఉషోదయం
ఊరగాయజాడీ
ఎదిగిన మనసు
ఎర్రగులాబీ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://archive.org/details/
పొందిన బిరుదులు / అవార్డులుతెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం
గృహలక్ష్మి స్వర్ణకంకణము
సుశీలా నారాయణరెడ్డి అవార్డు మొదలైనవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికడాక్టర్ వాసా ప్రభావతి కథానికలు
సంగ్రహ నమూనా రచనడా॥ వాసా ప్రభావతిగారిది విలక్షణమైన వ్యక్తిత్వం. అందుకే ఆవిడ సాహిత్య సేద్యాన్ని చేస్తూనే, రచయిత్రులందరికీ సాహిత్యం పట్ల అభిరుచి పెరగడానికీ కృషి చేస్తున్నారు. చాలామంది రచయిత్రులకు తమ సంస్థ ద్వారా ఆవిడ ఆదర్శం

వాసా ప్రభావతి

డా॥ వాసా ప్రభావతిగారిది విలక్షణమైన వ్యక్తిత్వం. అందుకే ఆవిడ సాహిత్య సేద్యాన్ని చేస్తూనే, రచయిత్రులందరికీ సాహిత్యం పట్ల అభిరుచి పెరగడానికీ కృషి చేస్తున్నారు. చాలామంది రచయిత్రులకు తమ సంస్థ ద్వారా ఆవిడ ఆదర్శం.
అందుకే ఆవిడ కథానికల సంపుటాన్ని నాజన్మదిన సందర్భంలో తీసుకురావాలని నిర్ణయించుకోవడం జరిగింది. పదహారు కథానికలతో ఆ పదహారణాల ఆడబడుచుకి కానుక ఈ చిరుగ్రంథం.
”ఊరగాయజాడీ”తో ప్రారంభమై ఈ కథానికా సంపుటి ‘నాకూ ఓ మనసుంది’తో ముగుస్తుంది. ఛాందస కుటుంబాల్ని మన కళ్ళ ముందుంచుతూనే, వాళ్ళలో విప్లవాత్మక భావాల్ని మెరిపించారు రచయిత్రి. ‘కొత్తవెలుగు’, ‘అనసూయ లేచిపోయింది’ లాంటి కథానికలు అందుకు నిదర్శనాలు. పెదాలమీద చిరునవ్వుని తాండవింపజేసే కథానికలు – ‘ఊరగాయజాడీ’, ‘కామాక్షీ – కాసులపేరు’ లాంటివి.
ఈ కథానికలు మీ అందరికీ ఆనందం కలిగిస్తాయని ఆశిస్తున్నాను. కేవలం ఆనందం కలిగించడమే కాదు, మెదడుకి మేతా పెడతాయన్న కథానికా లక్షణం కూడా ఈ కథానికల్లో మనకి కనిపిస్తుంది. చదవండి….మీకే తెలుస్తుంది.

———–

You may also like...