ఇల్లిందల సరస్వతీదేవి (Illindala Saraswati Devi)

Share
పేరు (ఆంగ్లం)Illindala Saraswati Devi
పేరు (తెలుగు)ఇల్లిందల సరస్వతీదేవి
కలం పేరు
తల్లిపేరుకామరాజు రత్నమ్మ
తండ్రి పేరువెంకటప్పయ్య
జీవిత భాగస్వామి పేరుసీతారామారావు
పుట్టినతేదీ06/15/1918
మరణం31 ఆగష్టు 1998
పుట్టిన ఊరునర్సాపురం
విద్యార్హతలు
వృత్తితెలుగు కథారచయిత్రి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుదరిజేరిన ప్రాణులు
ముత్యాల మనసు
స్వర్ణకమలాలు
తులసీదళాలు
రాజహంసలు
కళ్యాణ కల్పవల్లి
మనము – మన ఆహారము (అనువాదము)
అనుపమ (నవల)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1982లో స్వర్ణకమలాలు కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
స్వర్ణకమలాలు కథాసంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లభించింది.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచనసభ్యతా సంస్కారాలకు ఆటపట్టయిన కామరాజు సరస్వతీదేవి సంప్రదాయ సంస్కృతులకు నెలవైన ఇల్లిందలవారి కోడలయింది.

ఇల్లిందల సరస్వతీదేవి

ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు.

తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

———–

You may also like...