| పేరు (ఆంగ్లం) | Shivaraju Venkatasubbarao(bucchi babu ) |
| పేరు (తెలుగు) | శివరాజు వెంకటసుబ్బారావు(బుచ్చిబాబు) |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వెంకాయమ్మ |
| తండ్రి పేరు | శివరాజుసూర్య ప్రకాశరావు |
| జీవిత భాగస్వామి పేరు | శివరాజు సుబ్బలక్ష్మి |
| పుట్టినతేదీ | 06/14/1915 |
| మరణం | 11/20/1967 |
| పుట్టిన ఊరు | ఏలూరు |
| విద్యార్హతలు | ఎం.ఏ. |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://archive.org/details/ |
| స్వీయ రచనలు | అజ్ఞానం (వచన కావ్యం) ఆశావాది ఆద్యంతాలు మధ్య రాధ నా అంతరంగ కథనం షేక్ స్ఫియర్ సాహిత్య పరామర్శ మేడమెట్లు (కథా సంపుటి) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు – వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. |
శివరాజు వెంకటసుబ్బారావు(బుచ్చిబాబు)
నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు – వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తిత్వం ఏర్పడి యీ బాధని ఇతరులతో చెప్పుగుని విముక్తుడవుతాడు. ఆ సంఘర్షణ నిలిచి, ద్వంద వ్యక్తిత్వానికి సమన్వయం కుదిరి, ఏకత్వం సాధించినవాడు అతను యోగి – ఇంక వ్రాయడు. ఈ గొడవ విని, యీ బాధని పంచుకోడానికి సిద్ధపడే పాఠకులు ఏ వొకరిద్దరో వుంటారేమో. ఒక్కడు వున్నా ఆ కథకుడు ప్రయోజనం సాధించి చరితార్ధుడైనట్లే భావిస్తాను.
———–