పేరు (ఆంగ్లం) | Gangadhari Sriramulu |
పేరు (తెలుగు) | గంగాధరి శ్రీరాములు |
కలం పేరు | జి.మాస్టర్జీ |
తల్లిపేరు | గంగాధరి సత్యమ్మ |
తండ్రి పేరు | రాజయ్య |
జీవిత భాగస్వామి పేరు | ప్రమీల |
పుట్టినతేదీ | 1952, సెప్టెంబర్ 7 |
మరణం | – |
పుట్టిన ఊరు | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం |
విద్యార్హతలు | బి.ఎ.,ఎల్.ఎల్.బి |
వృత్తి | కవి, సినీగేయ రచయిత, గాయకుడు. జననాట్యమండలి కళాకారుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘ఈ దేశం నీదన్నగాని రాజ్యం నీదన్ననా!’ ‘చేతిలో కత్తేది లేదు. చంకలో తుపాకి లేదు’ ‘ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బాంధవులు’, ‘జోజోర దళితన్న జోర దళితన్న’, |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |
గంగాధరి శ్రీరాములు
మాష్టార్జీ పేరుతో సుపరిచితుడైన గంగాధరి శ్రీరాములు కవి, సినీగేయ రచయిత, గాయకుడు. జననాట్యమండలి కళాకారుడు.
ఇతడు తన ఏడవ యేటి నుండే కవితారచన మొదలు పెట్టాడు. విద్యార్థిదశలో ఉర్రూతలూపే ఉద్యమగీతాలు, ప్రేమగీతాలూ వ్రాశాడు. ఆలిండియా రేడియోలో దేశభక్తి గీతాలు గానం చేశాడు. 400లకు పైగా ప్రైవేటుగీతాలను రచించి రసజ్ఞుల హృదయాలను గెలుచుకున్నాడు. అందులో ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ అనే పాట 8 భాషల్లోకి అనువాదమై, అనేకమంది మన్ననలు అందుకుంది. 2001లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచజాతుల సదస్సులో నల్లజాతీయులపై ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ’ అనే ఇంగ్లీష్ పాటను ఇతడు అప్పటికప్పుడే రాసి పాడాడు
———–