పేరు (ఆంగ్లం) | Andulluri Sudhakar |
పేరు (తెలుగు) | ఎండ్లూరి సుధాకర్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/21/1959 |
మరణం | 28 జనవరి 2022 |
పుట్టిన ఊరు | నిజామాబాద్ |
విద్యార్హతలు | ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్డి |
వృత్తి | పీఠాధిపతిగా పదవీ బాధ్యతల నిర్వహణ |
తెలిసిన ఇతర భాషలు | హిందీ, ఉర్దూ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://sudhakaryendluri.blogspot.com/ |
స్వీయ రచనలు | వర్తమానం,కొత్త గబ్బిలం,నా అక్షరమే నా ఆయుధం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/book/Gosangi,http://kinige.com/author/Yendluri+Sudhakar |
పొందిన బిరుదులు / అవార్డులు | లలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ -1980 స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి, యలమంచిలి- 1990 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1992 ఉదయభారతి జాతీయ అవార్డు, భువనేశ్వర్-1993 కవికోకిల జోషువ పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కలల అక్షరం |
సంగ్రహ నమూనా రచన | నన్నొక మొక్కను చేయండి మీ ఇంటిముందు పువ్వునవుతాను నన్ను ఊయలలూపి చూడండి మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి |
ఎండ్లూరి సుధాకర్
నన్నొక మొక్కను చేయండి
మీ ఇంటిముందు పువ్వునవుతాను
నన్ను ఊయలలూపి చూడండి
మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను
నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి
ముక్కోటి దేవతలతో
విసిగిపోయాను
వెలివేయబడ్డాను
నన్నొక గోడను చేయండి
ఒక వాక్యమై నిలదీస్తాను
నన్నొక పిడికిలి చేయండి
నలుగురి కోసం నినదిస్తాను
నన్ను మతాల మంత్రనగరికి పంపకండి
నన్ను తీవ్రవాదిని చేసి చంపకండి
నా చుట్టూ గిరి గీయకండి
నేనెవరి గూట్లో ఇమడలేను
నన్నొక అడవిలో వదిలేయండి
అగ్నిపూల వనమవుతాను
సీతాకోక చిలుకల రెక్కలు విరిచి
స్వేచ్చ గురించి మాట్లాడకండి
నన్ను కొత్త కోకిలను చేయండి
చైతన్య చైత్ర గీతమవుతాను
నా హక్కుల గొంతు కోయకండి
నా పాటల పురిటి నొప్పులు వినండి
నన్ను జైల్లో బంధించకండి
నేనీ దేశపు ఆత్మగౌరవాన్ని !
నా కలాన్ని విరిచేయకండి
నేనొక కలలుగనే అక్షరాన్ని
నన్ను హిమాలయాల మీద చూడండి
నేనొక జెండానై రెప రెపలాడతాను
———–