| పేరు (ఆంగ్లం) | Kala Venkata Krishna Kumari |
| పేరు (తెలుగు) | కళా వెంకట కృష్ణ కుమారి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సత్యవతి |
| తండ్రి పేరు | కాజా వెంకట జగన్నాథరావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | తెనాలి |
| విద్యార్హతలు | ఎం.బి.బి.ఎస్ |
| వృత్తి | రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | భలే పెళ్ళి’ నాటకం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | రమ్యకథా కవయిత్రి |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
కళా వెంకట కృష్ణ కుమారి
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం ‘భలే పెళ్ళి’ నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణితో కలసి పోటాపోటీగా సీరియల్స్ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే. దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంథాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.
———–