కాశీభట్ల వేణుగోపాల్ (Kashibatla Venugopal)

Share
పేరు (ఆంగ్లం)Kashibatla Venugopal
పేరు (తెలుగు)కాశీభట్ల వేణుగోపాల్
కలం పేరు
తల్లిపేరుహనుమాంబ
తండ్రి పేరుకాశీభట్ల యల్లప్ప శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీజనవరి 2, 1954
మరణంఆగస్టు 19, 2024
పుట్టిన ఊరుకర్నూలు.
విద్యార్హతలు
వృత్తితెలుగు కవి , రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఘోష – కథల సంపుటి
నేనూ – చీకటి నవల
దిగంతం – నవల
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/kbrowse.php?via=author&name=Kasibhatla+Venugopal&id=369
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనికషం
సంగ్రహ నమూనా రచనఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
నిన్నటి ప్రత్యూషం నేడు లేదు.
ఈరోజుటి ప్రదోష సంధ్య.. రేపటికి పాతది… మాసినది…
ఓ గంట క్రితం చుట్టేసిన దుఃఖం యిప్పుడు శూన్యం.

కాశీభట్ల వేణుగోపాల్

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
నిన్నటి ప్రత్యూషం నేడు లేదు.
ఈరోజుటి ప్రదోష సంధ్య.. రేపటికి పాతది… మాసినది…
ఓ గంట క్రితం చుట్టేసిన దుఃఖం యిప్పుడు శూన్యం.
ఈ చిటికెడు విషాదాలూ…
క్షణ కాలప్పాటు మెరిసే ఆనందాలూ… సుఖాలూ…
వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు…
అన్నీ… అందరూ కల్సి ఎక్కడికి?
ఎటువేపుకీ ప్రస్థానం?
ఒక అనుభూతి నింకో అనుభూతి కబళిస్తూ…
అంతంలేని దారిలో…
అక్కడక్కడా ఆగిపోతూ… చివరికి?
అంతా… అన్నీ… అందరూ… ఒకే ఒక గహ్వరంలోకి…
కాంతిని కూడా స్వాహా చేసే ఒక మహా బిలంలోకి…
భావాతీత… అనుభూతిరాహిత్య…
మహా శూ… న్యం… లో…. కి
Yes in to that something called
N…O….T…H…I…N…G

———–

You may also like...