ఆశావాది ప్రకాశరావు (Prakasa Rao Asavadi)

Share
పేరు (ఆంగ్లం)Prakasa Rao Asavadi
పేరు (తెలుగు)ఆశావాది ప్రకాశరావు
కలం పేరు
తల్లిపేరుకుళ్ళాయమ్మ
తండ్రి పేరుపక్కీరప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1944 ఆగష్టు 2
మరణం2022 ఫిబ్రవరి 17
పుట్టిన ఊరుకొరివిపల్లి గ్రామం
విద్యార్హతలుబి.ఏ. స్పెషల్ తెలుగు
వృత్తిఅవధాని, కవి
లోయర్ డివిజినల్ క్లర్క్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపుష్పాంజలి
వరదరాజశతకము
నిర్యోష్ఠ్య కృష్ణశతకము
విద్యాభూషణ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2021లో పద్మశ్రీ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

డాక్టర్ ఆశావాది ప్రకాశరావు

నిషిద్ధాక్షరి

శ్రీదా!దయనన్ గన్మా!
వేదపథా!పర్వతస్థ!విద్యుద్ధాత్రీ!
బాధాఘ్నవిభూ!రమ్మా
నీ దర్శనభాగ్య మిమ్ము నీరదగాత్రా! (వేంకటేశ్వర స్తుతి)
శ్రీ జననీప్రియవస్త్రా!
భ్రాజత్ చక్రాంక!మాతృభాగ్యకళాంకా!
తేజోరక్షాదక్షా!
మా జాతీయ త్రివర్ణ మాన్యపతాకా! (జాతీయపతాకం గురించి)

సమస్యాపూరణ

ఉంగరమే నడుమునందు నూగిసలాడున్

బంగరు బొమ్మ యొకర్తుక
రంగస్థలి నిల్చి నాట్యరంజనబుద్ధిన్
బొంగరమట్లు వెసన్ తిరు
గుంగరమే(తిరుగున్+కరమే) నడుమునందు నూగిసలాడున్

నాది నాది నాది నాది నీది
అక్షరార్చనమ్ము, అవధానకలనమ్ము,
కవితలల్లునేర్పు, గానకళయు,
కూర్మిని విని కున్కు నోర్కి – క్రమమ్ముగా
నాది నాది నాది నాది – నీది

దత్తపది

లాకర్,జోకర్,వీకర్,క్రాకర్ ఈ పదాలతో జోలపాట
జోజో శిశులీలాకర!
జోజో కరుణాంబకా! విశుద్ధమహస్కా!
జోజో ధృతదేవీకర!
జోజో చక్రాకరకర!జోజోకృష్ణా!
జారేజా, పీరేపీ, వారేవా, తూరేతూ పదాలతో నిండు జవ్వని అందాల వర్ణన
జారే జాజుల వేణి తా కటిపయిన్ సయ్యాట మాడంగ సొం
పీరే పీసపయోధరాగ్రములపై విన్యాసముల్ సూపుచున్
వారేవారయినన్ చలించునటు రూపాజీవనల్ కాన కం
తూ! రే! తూపుల నేల నెక్కిడెద వన్యూన ప్రతాపంబునన్

వర్ణన

తెలుగున్నేల చెరంగునాల్గులను సందీపించు నీ ప్రక్రియన్
వలపున్ బెంచుచు నన్యరాష్ట్రములలో వ్యాపింపఁగాఁ జేసె నే
అలఘుం డాతడె మద్గురూత్తముఁడు సుబ్బన్నాఖ్యుఁ డీవేళ నా
తలలో నాల్కగ నిల్చి యిచ్చు జయ సంధానప్రదాశీస్సులన్
(సి.వి.సుబ్బన్న శతావధాని గురించి)
దోర్గర్వాంధుల కీలుబొమ్మయై సంతోషంబు కోల్పోవుటన్
స్వర్గక్షేమము సంఘచేతనము సంపాదింపగా స్త్రీలకున్
దుర్గాబాయి సతీశిరోమణి కృషిన్ తోరంబుగా నిల్పెనాన్
భర్గోత్తేజసుఖస్థితిన్ నిలిచెఁబో వాణీ నివాసంబిటన్
(దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్త్రీజనోద్ధరణకృషి గురించి)

———–

You may also like...