ఎం.వల్లభాపురం జనార్థన (M.Vallabhapuram Janarthana)

Share
పేరు (ఆంగ్లం)M.Vallabhapuram Janarthana
పేరు (తెలుగు)ఎం.వల్లభాపురం జనార్థన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపహారా కాస్తున్న రాత్రి(వచన కవితా సంకలనం)
యుగ పతాక శ్రీశ్రీ (దీర్ఘకవిత)
విషకౌగిలి 123 అణుబంధ నానీలు
విజయక్రాంతి (సంగీత రూపకం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

వల్లభాపురం జనార్ధన

సురవరం ప్రతాపరెడ్డి గురించి… సీస పద్యం:

తెలగాణ తెలుగున వెలుగులు చూపించి
ప్రాంతీయ ప్రతిభను పంచినాడు
తెలగాణ నేలలో తెలివికి చీకటి జాడయే లేదని చాటినాడు
మరియాదలను వీడి మాటతూలినవారి
గర్వమ్ము దించగా కదలినాడు
తెలగాణ తెలుగులో తీయందనాలను
చూడని నాల్కకు చూపినాడు
వైతాళికుండుగా జాతిరాగము పాడి
తెలగాణ ధిషణను తెలిపినాడు
తే:గీ:
మిట్టమధ్యాహ్న సూర్యుడై మెలగినాడు
ఆంధ్ర గర్వము చెండాడియలరినాడు
ప్రాంత తెలగాణ నడవడి పట్టిచూపి
రచనలందున రత్నాల రశ్మి చూపి
సురవరము జాతి మర్యాద చూపినాడు
కందం:
ప్రతిభా మంజూష తెరిచి
శ్రుతి చేసెను తెలుగుబాస చిన్నెల లయలన్
మతిమంతుడు జనహిత వరి
స్తుతికే స్తుతియయి నిలిచెను సురవర మతియై
కందం:
సేద్యము కవితా సేద్యము
వేద్యత పరిశోధకత్వ విద్వచ్చవియై
హృద్యపు రచనలు చేసెను
ఖాద్యములుగ బుద్ధికిడగ ఘన సురవరమే
కందం:
స్థిరుడై భాషా రతుడై
సురుచిరమగు గ్రామ్యభాష సొబగులు తెలిపీ
సురభాష కన్న మిన్నని
పరిచయమొనరించె భువికి భాసుర వరమే
ఉత్పలమాల:
బాలిశులైనయాంధ్రుల సవాలుకునిచ్చె జవాబు దీటుగా
సాలగ గోలకొండ కవి సంచిక నిల్పి చరిత్ర సాక్షిగా
గాలికి తూలిపోదు తెలగాణ యశమ్మని చాటి చెప్పెరా
చాలిన స్వాభిమాన జవసత్వపు దుర్భిణి చూడు సాహితిన్
శా ర్దూల వృత్తం:
శ్రీ రామాయణ కావ్యగాథగల రాశీభూతమౌ కల్పనల్
సారాంశమ్మున విశ్వసించుటకు సాక్ష్యాధారముల్ లేవనెన్
చారిత్రాత్మక గీటురాయిపయి సంచాలించి చూపించెరా
ధీరుండౌ పరిశోధకుండు ప్రతిభా ధీ రశ్మి మార్తాండుడే
తేటగీతి:
ఆంధ్ర తెలగాణ జీవన వ్యాకరణము
సంస్కృతీ నాగరికతల సౌరభాల
తెలుగు వెలుగుల చీకటి తీరులన్ని
గరిమనాంధ్రుల సాంఘిక చరిత రాసి
కొత్త పరిశోధనకు దారులెత్తి చూపె
తేటగీతి:
భాష సౌందర్య రూపము పరిమళించ
లిపికి సంస్కరణమ్ముల ప్రాపు వలయు
ననుచు చర్చించి నవ సూత్రమునులిఖించె
సురవరమ్ము భాషాశాస్త్ర పరిమళమ్ము

———–

You may also like...