మానేపల్లి హృషీ కేశవరావు (Manepalli Hrishi Kesava Rao)

Share
పేరు (ఆంగ్లం)Manepalli Hrishi Kesava Rao
పేరు (తెలుగు)మానేపల్లి హృషీ కేశవరావు
కలం పేరునగ్నముని
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ05/15/1940
మరణం
పుట్టిన ఊరుతెనాలి
విద్యార్హతలు
వృత్తిఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఉదయించని ఉదయాలు (1962)
తూర్పుగాలి (1972)
కొయ్యగుర్రం (1977)
జమ్మిచెట్టు (1987)
నగ్నమునికథలు (1971)
విలోమకథలు (1979)
ఉన్నవలక్ష్మీనారాయణ ‘మాలపల్లి ‘ నవలను 1974లో నాటకీకరించాడు.
మరోచరిత్ర, ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు, ఉదయం సినిమాలకు కథ స్క్రీన్‌ప్లే సమకూర్చాడు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1973 లో
మద్రాసు తెలుగు అకాడెమీ వారి పురస్కారం – 1989
కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం – 1991
తెలుగు విశ్వవిద్యాలయం సత్కారం – 1991
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

మానేపల్లి హృషీకేశవరావు విశ్వకర్మ నగ్నముని

నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషీకేశవరావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1940, మే 15 తేదీన జన్మించారు బందరు, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశారు1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్ గా పనిచేసారు.ఈ విశ్వకర్మ కొంతకాలం ‘దిగంబర ‘ కవితాఉద్యమంలో ఉన్నారు. విరసం వ్వవస్థాపక సభ్యుల్లో ఒకరు తెలుగు కవిత్వ సీమలోకి దిగంబర కవిత్వం ఒక ప్రభంజనంలా వచ్చి ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆ దిగంబర కవులకి ప్రయోక్త అనదగిన వ్వక్తి నగ్నముని .దిగంబర కవిత్యోద్యమంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినకవి నగ్నముని. నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే ఆరుగురు కవులు దిగంబర కవితా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించిన దిగంబర కవిత్యోద్యమం ఉధృతంగా సాగి కవితారంగాన్ని చైతన్యపరచింది. శక్తివంతమైన వాక్యానికి ప్రతీక నగ్నముని.ముఖ్యంగా వాక్యంలో వ్యక్తిత్వాన్ని దట్టించిన కవి .అప్పటివరకూ ఉన్న కవిత్వ రచనా విధానాన్ని కొత్త మలుపు తిప్పిన కవి కూడా.వాక్యాంతాన్ని క్రియతో కాకుండా కర్త తో , విశేషణం తో రూపొందించిన తొలి కవి కూడా ఇతనే. ఆగ్రహం,దర్శనీయత్వం,లోతూ, తేటదనం, ప్రయోగాత్మకతా కలగలిస్తే నగ్నముని కవిత్వం.తన ఇంపాక్ట్ ను తప్పుకుని రాయలేని కవులే ఎక్కువ.ముఖ్యంగా దళిత కవులు నగేష్ బాబు, తెరేశ్ బాబు, నగ్నముని వ్యక్తీకరణ దొంతరని చెరోవైపునుంచి స్వీకరించారు.ఆయన కవితా విలోమవాక్యం ఇప్పుడు రాస్తున్న ఇండస్ మార్టిన్ లోనూ నాకు కనిపిస్తుంది. 

———–

You may also like...