Share
పేరు (ఆంగ్లం)Aruna Sagar
పేరు (తెలుగు)అరుణ్ సాగర్
కలం పేరు
తల్లిపేరుభారతీదేవి
తండ్రి పేరుటి.వి.ఆర్.చంద్రం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/02/1967
మరణం02/12/2016
పుట్టిన ఊరుఖమ్మం జిల్లా
విద్యార్హతలుమానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)
వృత్తిటీవీ5 సీఈవో,కవి, రచయిత, పాత్రికేయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమేల్‌ కొలుపు,మ్యూజిక్ డైస్,మియర్ మేల్,మాగ్జిమమ్‌ రిస్క్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులురొట్టమాకురేవు కవితా పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమేల్ కొలుపు
సంగ్రహ నమూనా రచన“మగాళ్ళంతా ఇంతే” అని స్త్రీవాదులు స్వీపింగ్ జనరలైజేషన్ చేసినప్పుడల్లా, ఒక్కసారిగా నాలో ఉవ్వెత్తున ఎగిసే నిరసన స్వరాల్ని ఎప్పుడూ అక్షరబద్ధం చెయ్యలేకపోయాను. కానీ నా స్వరాన్ని సంగీతంలా వినిపించిన పుస్తకాన్ని ఇప్పుడే చదివాను. నా భావాల తీవ్రతను మించిన వ్యక్తీకరణ కలిగి ఉండటమో లేక నా ఆలోచనల తీరాల్ని తాను తాకొచ్చిన అనుభూతిని మిగల్చడమో తెలీదుగానీ ఇంస్టంట్ గా ఈ పుస్తకం నాకు నచ్చేసింది. అప్పుడప్పుడూ నాలో రేగిన భావతుంపరల్ని జడివానలాగా కురిపించిన ఈ పుస్తకం పేరు “మేల్ కొలుపు”. రచయిత అరుణ్ సాగర్.ఆంధ్రజ్యోతి లో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించారు.

అరుణ్ సాగర్

“మగాళ్ళంతా ఇంతే” అని స్త్రీవాదులు స్వీపింగ్ జనరలైజేషన్ చేసినప్పుడల్లా, ఒక్కసారిగా నాలో ఉవ్వెత్తున ఎగిసే నిరసన స్వరాల్ని ఎప్పుడూ అక్షరబద్ధం చెయ్యలేకపోయాను. కానీ నా స్వరాన్ని సంగీతంలా వినిపించిన పుస్తకాన్ని ఇప్పుడే చదివాను. నా భావాల తీవ్రతను మించిన వ్యక్తీకరణ కలిగి ఉండటమో లేక నా ఆలోచనల తీరాల్ని తాను తాకొచ్చిన అనుభూతిని మిగల్చడమో తెలీదుగానీ ఇంస్టంట్ గా ఈ పుస్తకం నాకు నచ్చేసింది. అప్పుడప్పుడూ నాలో రేగిన భావతుంపరల్ని జడివానలాగా కురిపించిన ఈ పుస్తకం పేరు “మేల్ కొలుపు”. రచయిత అరుణ్ సాగర్.ఆంధ్రజ్యోతి లో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించారు.

ఈ పుస్తక ప్రారంభంలో చెప్పినట్లు “స్త్రీవాదం ఒక ప్రత్యేకమైన రాజకీయం. ఒక అస్థిత్వం. ఆత్మగౌరవ సిద్ధాంతంగా ముందుకు వచ్చినప్పుడు, మగగొంతుకతో రాయడం” ఈ రచయిత చేసిన సాహసం. ఇన్ని అస్థిత్వ ఉద్యమాలలోనూ ఉన్న పెద్ద లోపం ఎమిటంటే, సమాధాన స్వరానికి స్థలం ఇవ్వకపోవడం. ఈ పరిస్థితి యొక్క ఔచిత్యాన్ని ఈ సంకలనం ప్రశ్నిస్తుంది. మగాళ్ళని పీడకులుగా ఆక్షేపించిన స్త్రీవాదం మగాడి సమాధాన స్వరాన్ని త్రొక్కిపట్టడాన్ని నిరసిస్తుంది. అంతేకాక “అనేక భారాల కింద, అనేక ఒత్తిడుల కింద అపౌరుషంగా మారిపోతున్న మగజీవితాల గురించి, స్టీరియోటైపింగ్ లో అణగారిపోతున్న మంచి మగతనాల గురించి” ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. ఇలా ప్యారలల్ థాట్ లో కూడా ప్రత్యామ్న్యాయం ఉంటుందని నిరూపిస్తుంది.

‘తొలినమస్కారం తండ్రికి’ అని మొదలెట్టి “కావాలంటే నిమ్సుకెళ్ళు, ఐసీయూలో గుండెచేత పట్టుకుని వరసలు వరసలు నాన్నలు నాన్నలు…మీసాలుండని కవిత్వానికిది తెలుసా?…పత్తికాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిందెవరు. అయ్యా యువార్ నాట్ ఎప్రిసియేటెడ్!” అంటూ అన్సంగ్ హీరో నాన్నకి నమస్కారం చేసి “నీ ఆన, ఇప్పుడిక పురుషుల కోసం. వారోపవారాలుగా వాదోపవాదాలుగా!” అని ఆరంభిస్తాడు. “…ఎవ్వడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం. ఒంటరి చెట్టు. ఒంటరి ద్వీపం. ఒంటరి గీతం. కన్నీరు నిషిద్ధం. కేవలం హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు. కొన్ని బూతులు తిట్టడం తప్ప” అని ఈసడించుకుంటాడు.

ఇంత నిరసనలోనూ “మీ అనాటమీ, మీ దేహభాష అనువదించుకుని అవగాహన చేసుకోవడం, ఆస్వాదించడం మాకు చాలాచాలా ఇష్టం. ఇది బయొలాజికల్. ఇది బయోకెమికల్. హార్మోనల్. ఉయ్ లవ్ ఉమెన్.” అని డిక్లేర్ చేస్తాడు. అదే ఊపులో “ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది. లేకుంటే భిన్నధృవాల మధ్య ఆకర్షణేముంటుంది.” అని మగాళ్ళవ్వాలనుకునే ఆడాళ్ళకు చురక అంటిస్తాడు.”మీరూ మేమూ భిన్నం. అదే సృష్టికి అందం. లెటజ్ సేవిట్” అని రాజీచేసుకుంటాడు.

‘స్త్రీలు అర్థం కారు’ అనే సాధారణ నమ్మకాన్ని సెలెబ్రేట్ చేస్తూ, “జీవితమంతా స్త్రీల గురించి కొత్తకొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. న్యాయప్రయోగ తర్కంలో థీసిస్- యాంటీథీసిస్. సింథసిస్- – థీసిస్- సింథసిస్. కానీ ఈ కాంటెక్స్ట్ లో అది అప్లయి అవడం లేదేంటి” అని అబ్బురపడతాడు. “ఓపన్ మేంసాబ్..ఓపన్ ఓపన్” అని బ్రతిమాలుకుంటాడు. మగాడిలోకూడా తండ్రిప్రేముంటుందని చెబుతూ, “నాకు పిల్లలంటే ఇష్టమే. నీకెంత ఇష్టమో నాకూ అంతే. పిల్లలు కనిపించినప్పుడు నువ్వెంత ముచ్చటపడతావో నేనూ అంతే. కావాలంటే నా గుండెకు అడ్డుకోత పటం గీయి. ప్రియా!” అని సాధికారంగా తెలియజెబుతాడు.

మగాడి మూసలైన రక్షకులు-పోషకులు- యోధుల స్టీరియోటైప్ మోడల్స్ ను పెళ్ళగించి, స్వతంత్రుల్ని చెయ్యమని ఆకాంక్షిస్తాడు. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదనే సోషియల్ ప్రోగ్రామింగ్ ని కాదని, “ఒకసారి ఏడవాలి ఉంది… వెక్కివెక్కి పొంగి పొరలి ధారలు చారలుగా. నన్నొకసారి కడుక్కోవాలనుంది.” అని కోరుకుంటాడు. “వెయ్యి విఫలగాథల్లో తొమ్మిదివందల తొంభై తొమ్మిది కథల్లో మగాడే వంచకుడు. వదిలెయ్ గురూ! వారెప్పుడూ నీ డార్క్ సైడ్ చూడటానికే అలవాటుపడ్డారు.” అని ఎద్దేవా చేస్తాడు. “మనసారా ప్రేమించిన, మీ ప్రేమను పొందిన తొలిప్రేమికుడు తారపడితే దయచేసి అన్నయ్యా అని మాత్రం పిలవకండి- హైట్ ఆఫ్ హిపోక్రసీ” అని స్త్రీలలోని ద్వద్వవైఖరిని చీదరించుకుంటాడు.

“కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడేవాళ్ళు తాము విసిరే వగలవల గురించెందుకు ప్రస్తావించరు. ఎపెల్విక్ థ్రస్ట్ ఈజ్ ఎ గుడ్ కెరీర్ మూవ్! ఏస్కూలిది?” అని, వగలు విసిరి ఉద్యోగపు నిచ్చెనలెక్కే ఆడవారు, మగాడి దౌష్ట్యాన్ని గురించి మాత్రం ఫ్రేముకట్టి మరీ మాట్లాడే విధానాన్ని నిరసిస్తాడు. రెండూ ఉన్నప్పుడు ఒకదానే ఆక్షేపించడం కూడా వివక్షే అని గుర్తుచేస్తాడు. అంతేకాకుండా ఎదిగిన అర్బన్ మేల్ సహజన్యాయాల్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి వగలూ,గోమూ అనే ఆయుధాలతో ఫెమినైన్ ఛార్మ్ స్ప్రే చెయ్యఖ్ఖరలేదని ఖరాఖండిగా నచ్చజెబుతాడు. అదే ధాటున “మాకు సౌదర్య దృష్టిని ప్రసాదించిన దేవతలకు నమస్కృతులు. స్త్రీత్వపు లాలిత్యాన్ని మృదుస్పర్శతో రుచి చూపించిన మందగమనలకు వందనములు.” అని ప్రేమిస్తాడు.

“పురుషుల ఆకాంక్షలను ఎందుకలా వ్యక్తితమైనవిగా చూస్తారు” అని ప్రశ్నిస్తూ, “కనబడలేదా మగజీవుల త్యాగాల జాడలు. యుద్ధాలలో ఒరిగిన నరకంఠాల నుంచీ స్రవించిన నెత్తుటి ధారలు. గురించుడి. కీర్తించుడి. అనుకూల ధోరణి అవలోకించుడి.” అని కారణాల్ని చూపుతాడు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. ఎందుకంటే, ఎవర్ని ఉద్దేశించాలో తెలియలేదు అని నమ్రతతో ఒప్పుకుంటూనే, ఇదొక “సమాంతర స్వరం వినిపించే ప్రయత్నం” అని ముగిస్తాడు.

స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ నెస్ – చైతన్యస్రవంతిని పోలిన ఈ రచనా శైలిలో వ్యంగ్యం, నిరసన, ఆక్షేపన, ఆవేదన, విన్నపాలు, ఒప్పుకోళ్ళూ అన్నీ కలగలిపి రచయిత అందిస్తాడు. స్త్రీవాదానికి ప్రతికూలం కాకపోయినా, ఒక సాధానవాదాన్ని ప్రత్యామ్న్యాయంగా ఎంచుకోవడం ఈ కాలంలో చాలా సాహసనే చెప్పాలి. కాకపోతే ఆర్థిక సంస్కరణల నేపధ్యంలో వేగంగా మారిన సామాజిక పరిస్థితి దృష్ట్యా ఈ సమానాంతర స్వరం అత్యంత ఆవశ్యకం. అందుకే ఇదొక ముఖ్యమైన పుస్తకం. మకాలీన అవసరాలకు అనుగుణంగా మగవాడు మార్పుచెందే ప్రయత్నం చేస్తుంటే, దాన్ని ప్రశంసించి అక్కున చేర్చుకునే అవకాశాన్ని కాలదన్ని, ఇంకా పాత మూసల్లోనే మగాడ్ని కొలుస్తున్న ఫెమినిస్టులకు ఒక అవసరమైన ఛాలెంజ్.

తన భావావేశంలో రచయిత చేసే విన్యాసాలు అక్కడక్కడా సెక్సిస్టుగా, మగాహంకారిగా అనిపించేలా చేస్తాయి. బహుశా అది కొత్త స్వరం అవడం వలన అలా అనిపిస్తుందేమో అనే ఆలోచన వెంఠనే వచ్చింది. దానికి కారణం, ఈ పుస్తకాన్ని అంకితమిస్తూ “నాన్నంతటి అమ్మకి. అమ్మంతటి నాన్నకి” అని రచయిత అన్న మాటలు. ఇంత సమానత్వాన్ని కాంక్షించే రచయిత ఆక్షేపించగలడుకానీ అవమానించడు అన్న నమ్మకం. ఈ సంకలంలోని కొన్ని వ్యాసాలను యధాతధంగా ఆమోదించవచ్చు. మరికొన్నింటితో విభేధించవచ్చు. మరికొన్నింటిని ఔట్రేజియస్ అని తిట్టుకోవచ్చు. కొన్నింటిని మ్యాడ్ నెస్ అని ముద్దుగా అభ్యంతరపెట్టొచ్చు. ఏది ఏమైనా కొంత సరదాకోసం మరికొంత మెడుకి మనసుకీ మెతకోసం ఖచ్చితంగా చదవాల్సి పుస్తకం.

———–

You may also like...