| పేరు (ఆంగ్లం) | Kancha Ilaiah |
| పేరు (తెలుగు) | కంచ ఐలయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | కంచ కాంతమ్మ |
| తండ్రి పేరు | కంచ కొమరయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 10/05/1952 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | వరంగల్ గ్రామీణ జిల్లా |
| విద్యార్హతలు | ఎం.ఏ పొలిటికల్ సైన్స్ |
| వృత్తి | డైరక్టరు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్ష్లూజన్ అండ్ ఇంక్లూజివె పాలసీ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నేను హిందువు నెట్లయిత? |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | మహాత్మా జ్యోతీరావు పూలే అవార్డు, నెహ్రూ ఫెలోషిప్ 1994-97, మాన్యవర్ కాన్షీరాం స్మృతి మాహానాయక్ పురస్కారం. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నేను హిందువు నెట్లయిత? |
| సంగ్రహ నమూనా రచన | నేను హిందువు నెట్లయిత హిందూ తత్వం, సంస్కృతి, రాజకీయ అర్థశాస్త్రం పై శూద్ర విమర్శ చేస్తూ కంచ ఐలయ్య వ్రాసిన పుస్తకం |
కంచ ఐలయ్య
‘నేను హిందువు నెట్లయిత’ అనే పుస్తకం, 1996లో కంచ ఐలయ్య ఆంగ్లంలో వ్రాసిన Why am not a Hinduఅనే పుస్తకానికి తెలుగు స్వేచ్ఛానువాదం. తెలుగులోకి రచయిత ఎ.సురేందర్ రాజు అనువాదం చెయ్యగా, రచయిత దానికి మరికొంత చేర్చి జనవరి 2000 లో తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చాడు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ముద్రించారు. పుస్తకం కవరు డిజైన్ మరియు లోపలి బొమ్మలు లక్ష్మన్ ఏలే వేశాడు. ఫోటోల సేకరణను కంచ ఐలయ్య, భరత్ భూషణ్ చేసారు.
రచయిత గురించి :
కంచ ఐలయ్య 1952లో తెలంగాణాలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాడు. శూద్రకూలంలోని కురుమ (గొర్రెలకాపరులు) కులానికి చెందినవాడు. హైదారాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1976లో M.A. చేసాడు. భూసంస్కరణలపై M.Phil, గౌతమబుద్ధుని తత్వ విచారణపై Ph.D చేసాడు. అదే విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవిభాగంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేసాడు. గత ముప్పై సంవత్సరాలుగా దళిత బహుజన, మానవహక్కుల ఉద్యమాల్లో భాగస్వామి. ఉస్మానియాలో ‘సత్యశోధక్’అనే అధ్యయన సంస్థ వ్యవస్థాపకులలో ఒకడు.1994-97 వరకు ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక తీన్‌మూర్తి లైబ్రరీలో నెహ్రూఫెలోగా పరిశోధన చేశాడు.1989లో “ది స్టేట్ అండ్ రిప్రెసివ్ కల్చర్”అనే పుస్తకం వ్రాసాడు. ఈ పుస్తకం మొదటిసారి కులవ్యవస్థకు మానవహక్కుల అణచివేతకు గల సంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. 1994 లో అర్తర్ బానర్తో కలిసి “డెమోక్రసీ ఇన్ ఇండియా-ఎ హాలోషెల్” అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీన్ని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఎకనామికల్ పొలిటికల్ వీక్లీ, ప్రాంటియర్, మెయిన్‌స్ట్రీం, సెమినార్ వంటి ప్రఖ్యాత పరిశోధనా పత్రికల్లో వ్యాసాలు వ్రాసాడు.
ఈయన ‘నలుపు’ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడు. అందులో రచయిత వ్రాసిన వ్యాసాలు రాష్ట్రమంతటా గుర్తింపు పొందాయి. రచయిత వ్రాసిన పెక్కు వ్యాసాలు, పుస్తకాలుగా అచ్చు అయ్యాయి. ఐలయ్య వ్రాసిన “మన తత్వము” అనే పుస్తకం ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురించబడి, అచ్చై, చాలా చర్చకు దారితీసింది. రచయిత దేశంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలైన ‘ది హిందూ’, ‘దక్కన్ క్రానికల్’, ‘ఇండియన్ ఎక్సుప్రెస్’ లలో ఎన్నోవ్యాసాలు వ్రాసాడు.
———–