రావి నరసింహ అవధాని (Ravi Narasimha Avadhani)

Share
పేరు (ఆంగ్లం)Ravi Narasimha Avadhani
పేరు (తెలుగు)రావి నరసింహ అవధాని
కలం పేరు
తల్లిపేరుశ్రీమతి సూర్యకాంతమ్మ
తండ్రి పేరుశ్రీ వేంకట్రామయ్య అవధాని
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1935 సెప్టెంబర్ 30
మరణం
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలుబి.కాం.
వృత్తి
తెలిసిన ఇతర భాషలుహిందీ, ఆంగ్ల
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబ్రతుకుతీపి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

రావి నరసింహ అవధాని

రావి ఎన్ అవధానిగా వినుతికెక్కిన ఆయన పూర్తి పేరు రావి నరసింహ అవధాని. 1935 సెప్టెంబర్ 30న జన్మించిన అవధాని గారి తల్లిదండ్రులు శ్రీమతి సూర్యకాంతమ్మగారు, చతుర్వేద పండితులు శ్రీ వేంకట్రామయ్య అవధానిగారు. విజయనగరం మహారాజా కాలేజీలో బి.కాం.డిగ్రీ, చదివిన ఆయన మెటీరియల్స్ మేనేజిమెంటులో డిప్లొమా పొందారు.1993లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆయన స్వస్థలం విజయనగరంలో స్థిరపడ్డారు. ఆయన తన 14వ ఏటనే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. 1951లో చిత్రగుప్త పక్ష పత్రికలో ప్రచురితమైన “బ్రతుకుతీపి” కథానిక ద్వారా కథా రచయితగా పాఠకులకు పరి చయమైన అవధాని గారు తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న దిన, వార, పక్ష, మాస పత్రిక లన్నింటిలోనూ 1951 నుండీ రచనలు చేస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసిన అవధానిగారు 800లకుపైగా కథానికలు, 400లకు పైైగా ఆధ్యాత్మిక వ్యాసాలు, 200లకు పైగా సాహిత్య వ్యాసాలు, 100 కవితలు,.100 బాలసాహిత్య కథలు, నవలలు, నాటికలు రాశారు.”ఫేకర్” అనే పత్రికకు పదేళ్ళపాటు సంపాదకత్వం వహించి ఎందరో ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించారు. ఈ మాసపత్రికలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ రచనలు వెలువడేవి. ప్రస్తుతం ఆయన విప్రవాణి ద్వై మాస పత్రిక సంపాదక వర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పొందిన అవార్డులూ రివార్డులూ బోలెడున్నాయి.ఆయన కథానికలపై పరిశోధన చేసిన శ్రీమతి ఆర్.శశికళగారికి ఆంధ్ర విశ్వ విద్యాలయం (విశాఖపట్నం) వారు 2007వ సంవత్సరంలో డాక్టరేట్ ఇచ్చారు.ఆయనతో మాట్లాడుతున్నప్పుడల్లా ఏదో ఒక కొత్త విషయం కళ్ళకు కట్టినట్లు చెప్పడం ఆయనలోని విశేషం

———–

You may also like...