పేరు (ఆంగ్లం) | Tripura Sundaramma Bhagavatula |
పేరు (తెలుగు) | త్రిపుర సుందరమ్మ భాగవతుల |
కలం పేరు | బీనాదెవి |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | భాగవతుల నరసింగరావు |
పుట్టినతేదీ | 1935 ఫిబ్రవరి 11 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పుణ్యభూమీ కళ్లు తెరు’. ‘హేంగ్ మీ క్విక్’ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |
త్రిపుర సుందరమ్మ భాగవతుల
బీనాదెవి అనేది కలంపేరు మాత్రమే. వ్రాసిన వారు ఇద్దరు. ఒకరు రచయిత్రి మరొకరు రచయిత. ఇద్దరూ భార్యా భర్తలు. భర్తగారు న్యాయమూర్తి, భార్య గృహిణి. కథల్లో ఎక్కువగా న్యాయమూర్తిగా చూసిన కేసులే ఎక్కువ ప్రేరణ. “బీనాదేవి” జంటలో భార్య పేరు భాగవతుల త్రిపుర సుందరమ్మ (జ: 1935 ఫిబ్రవరి 11) భర్త పేరు భాగవతుల నరసింగరావు. ఆయన ఆగస్టు 25, 1924లో జన్మించాడు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. భార్యభర్తా ఇద్దరూ కలిసి “బీనాదేవి” అనే కలం పేరుతో రచనలు చేసారు. వీరిపై రాచకొండ విశ్వనాథశాస్త్రి ప్రభావం ఎక్కువ.వీరు 1965 నుండి రచనలు కొనసాగిస్తున్నారు. బీనాదేవి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర పలుకుతుంటుంది.బీనాదేవి పేరు వినంగానే చప్పున స్పురించేవి ‘పుణ్యభూమీ కళ్లు తెరు’. ‘హేంగ్ మీ క్విక్’.బీనాదేవి కథల్లోని పాత్రల వస్తౌచిత్యం బాగుంటుందని ప్రతీతి.. వీరు వ్రాసిన “పుణ్యభూమీ కళ్లు తెరు”, “హేంగ్ మీ క్విక్” వంటి రచనలల్లో రావి శాస్త్రి ప్రభావం కనపడుతూ ఉంటుంది. అందువల్లనే కాబోలు ప్రముఖ రచయిత కొడవటి కుటుంబరావు రావి శాస్త్రి రచనా వ్యక్తిత్వానికి బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం అని అంటారు. 1972 లో వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇంతవరకూ బీనాదేవి పేరిట వెలువడిన కథలు, నవలలు, వ్యాసాలూ లభ్యమైనంతవరకూ సేకరించి డా. ఎల్. నరేంద్రనాధ్ గారి ప్రత్యేక సహకారంతో మనసు ఫౌండేషన్ ఈ సర్వస్వాన్ని తెలుగు పాఠకులకి “బీనాదేవి సమగ్ర రచనలు” అనే పుస్తకం ద్వారా అందించారు.
1990 లో భర్త భాగవతుల నరసింగరావు మరణం తర్వాత నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ భాగవతుల త్రిపురసుందరమ్మ బీనాదేవి పేరుతోనే కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించారు.
———–