పేరు (ఆంగ్లం) | Poranki Dakshina Murthy |
పేరు (తెలుగు) | పోరంకి దక్షిణామూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/24/1935 |
మరణం | – |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా |
విద్యార్హతలు | పీజీ |
వృత్తి | డిప్యుటీ డైరెక్టర్, తెలుగు అకాడెమీ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ముత్యాల పందిరి,రంగవల్లి,చంద్రవంక,అదొకటి తెలుసుకో చాలు,సినీ బేతాళ కథలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | డాక్టరేట్ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ముత్యాల పందిరి |
సంగ్రహ నమూనా రచన | డా. పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించారు. వివిధ ఉద్యోగాలు చేశారు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా 1993 లో పదవీ విరమణ చేశారు. ‘వెలుగూ వెన్నెలా గోదారీ’, ‘ముత్యాల పందిరి’, ‘రంగవల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించి మూడు మాండలికాలలోనూ తొలి నవలలు రచించిన కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలు రచించారు. అనేక అనువాదాలు చేశారు. తెలుగు కథానిక- స్వరూప స్వభావాలపై ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు. |
పోరంకి దక్షిణామూర్తి
డా. పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో 24 డిశంబరు, 1935న జన్మించారు. వివిధ ఉద్యగాలు చేశారు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా 1993 లో పదవీ విరమణ చేశారు. ‘వెలుగూ వెన్నెలా గోదారీ’, ‘ముత్యాల పందిరి’, ‘రంగవల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించి మూడు మాండలికాలలోనూ తొలి నవలలు రచించిన కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలూ రచించారు. అనేక అనువాదాలు చేశారు. తెలుగు కథానిక – స్వరూప స్వభావాలపై ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు.
చేనేత పనివారి కుటుంబంలో పుట్టాడు చంద్రయ్య. చదువు సంధ్యలకోసం ఉబలాటపడతాడు. మేనమామ కూతురు ముత్యాలుతో స్నేహంగా ఉంటాడు. ఆమె ఉంగరం తన వెలికి పెట్టుకొని పోగొడతాడు. తండ్రికి, మామకు భయపడి పరారి అవుతాడు. ముత్యాలు బావకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. బతకమ్మపండగ అవుతుంది. ముత్యాలు ఉంగరం నీళ్ళకుంటలో దొరుకుతుంది. చంద్రయ్య తిరిగి వస్తాడు. కాని, ముత్యాలుకు రాముతో పెండ్లి నిశ్చయమవుతుంది. చంద్రయ్య నేసిన ‘ముత్యాల పందిరి’ ఎందుకో? ఈ నవల చదివితే మీకు అర్ధమవుతుంది.
———–