| పేరు (ఆంగ్లం) | Aduri Satyavathi Devi |
| పేరు (తెలుగు) | ఆదూరి సత్యవతీదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | ఆదూరి వెంకటసీతారామమూర్తి |
| పుట్టినతేదీ | 12/08/1948 |
| మరణం | 10/16/2008 |
| పుట్టిన ఊరు | గుంటూరు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వెన్నెల్లో వేణుగానం రెక్కముడువని రాగం జలపాతగీతం వేయిరంగుల వెలుగు రాగం వెన్నెల సౌరభాలు మొదలైనవి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/home/aduri-satyavathi-devi/p-7488847-24396411995-cat.html |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1993లో రెక్కముడువని రాగం కవితా సంపుటికి ఎస్.టి.వి.డి.కళాసమితి అవార్డు 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘ఉత్తమ రచయిత్రి’ ప్రతిభా పురస్కారం. 1998లో ఆంధ్రలలితకళాసమితి (సికిందరాబాదు) నుండి కృష్ణశాస్త్రి పురస్కారం. 2000లో యునెస్కో లిటరరీ అవార్డు. 2002లో జైముని అకాడమీ (పానిపట్) వారి నుండి రామవృక్ష బేణీపూరి జన్మశతాబ్ది పురస్కారం. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | జలపాత గీతం |
| సంగ్రహ నమూనా రచన | అంత నిద్రాకాదు… కొంత మెలకువా కాదు వేకువ రెప్ప విప్పేటప్పటికి కువకువలతో కలిసి ఏవేవో అడుగుల రూప శబ్దం దగ్గరవుతున్న ఒకే రసానురాగం సాంద్రకరుణా తరంగిత మిన్నేటిరాగం శిలల్ని బ్రద్దలు కొటుకుంటూ దూకి వస్తున్న స్వచ్ఛ స్వర్ణ నిలోత్పల మేఘ రాగం విశ్వసాగరాల ఒడిలోంచి చిందిన ముక్తాఫల దేవరాగం గాడంగా హత్తుకున్న పచ్చల కెంపుల పద్మరాగం అది ఒక రసధ్యాన జలపాత గీతం ఒకింత ఆగేది లేదు… రవంత తిరిగి చేసేది లేదు దేహత్మల మీదుగా… ఒకే పరుగు |
ఆదూరి సత్యవతీదేవి
అంత నిద్రాకాదు… కొంత మెలకువా కాదు వేకువ రెప్ప విప్పేటప్పటికి కువకువలతో కలిసి ఏవేవో అడుగుల రూప శబ్దం దగ్గరవుతున్న ఒకే రసానురాగం సాంద్రకరుణా తరంగిత మిన్నేటిరాగం శిలల్ని బ్రద్దలు కొటుకుంటూ దూకి వస్తున్న స్వచ్ఛ స్వర్ణ నిలోత్పల మేఘ రాగం విశ్వసాగరాల ఒడిలోంచి చిందిన ముక్తాఫల దేవరాగం గాడంగా హత్తుకున్న పచ్చల కెంపుల పద్మరాగం అది ఒక రసధ్యాన జలపాత గీతం ఒకింత ఆగేది లేదు… రవంత తిరిగి చేసేది లేదు దేహత్మల మీదుగా… ఒకే పరుగు
ఆ కాసిన్ని అక్షరాల బలంతోనే మనిషిలోని మనిషితనం డీగ్రేడె అయిపోయి ప్రకృతికీ మనిషికీ వుండే లేక వుండాల్సిన జీవ సంబంధం ఘోరంగా యాంత్రికంగా మాత్రమే మిగిలిపోతే యు అర్ ది స్లాట్ అఫ్ ది ఎర్త్ అని అల్లప్పడెప్పుడో స్థ.మత్యూస్ గొస్పెల్ లో క్రైస్ట్ మానవత్వం రుచిని పోగొట్టుకున్న మనుషుల్నుద్దేశిస్తూ వాపోయినట్లు అదే సున్నితత్వంతో అదే విషాదపు కన్సర్న్ తో మీ ముందు యీ ముప్పయి ఆరు కవితల్ని ప్రకటిస్తున్నారు శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి.
———–