పేరు (ఆంగ్లం) | Datla Devadanam Raju |
పేరు (తెలుగు) | దాట్ల దేవదానం రాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | సూర్యనారాయణమ్మ |
తండ్రి పేరు | దాట్ల వెంకటపతి రాజు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/20/1954 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | ఎం.ఏ(ఆర్ధికశాస్త్రం), ఎం.ఏ(తెలుగు), ఎం.ఇడి. |
వృత్తి | ఉపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | ‘ఉదయిని’ 8-1-048, జక్రియ నగర్, యానాం – 533464 |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://datlaraju.blogspot.com/2012/02/ |
స్వీయ రచనలు | వానరాని కాలం (1997) కవితా సంపుటి గుండె తెరచాప (1999) కవితా సంపుటి మట్టికాళ్ళు (2002) కవితా సంపుటి దాట్ల దేవదానం రాజు కధలు(2002) కధా సంపుటి ముద్రబల్ల (2004) దీర్ఘకవిత లోపలి దీపం (2005) కవితా సంపుటి సరదాగా కాసేపు (2006) రాజకీయ వ్యంగ్య కధనాలు యానాం చరిత్ర (2007) నదిచుట్టూ నేను (2007) కవితా సంపుటి నాలుగో పాదం (2010) దీర్ఘ కవిత నాన్ గామ్ పాదమ్ (2010) (తమిళ అనువాదం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | వానరాని కాలం – ‘సరసం అవార్డు’ 1997 ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; 1999 ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ 2000 ‘మట్టికాళ్ళు-ఆంధ్ర సారస్వత సమితి అవార్డు’ 2003 ‘కళైమామణి’అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2003 ‘రీజెన్సీ కళావాణి పురస్కారం’2004 |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కథల గోదావరి |
సంగ్రహ నమూనా రచన | వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. |
దాట్ల దేవదానం రాజు
వడ్డించిన విస్తరి మాదిరి జీవితాలను ఒడిదుడుకులకు అతీతంగా గడిపేవారు ఎప్పటికీ కథావస్తువులు కాజాలరు. సామాన్యుల మధ్యకి – అందునా – ఒడిదుడుకులెరిగిన వారి మధ్యకు, రచయిత వెళ్ళాలి. అప్పుడే మనుషుల జీవితాలను పరిపాలించే పలు అంశాలు బయటకు వస్తాయి. దాట్ల దేవదానం రాజు, గోదావరి నది మీద యానాం తీరానికి ప్రయాణిస్తూ రకరకాల మనుషుల్ని పలకరిస్తూ వారి అంతరంగాల్ని శోధిస్తూ వ్రాసిన జీవవంతమైన కథలివి.
ఈ గుచ్చంలో కథలన్నిటికి కాన్వాస్ గోదావరే. పొడుగు వెడల్పుతో బాటు ఎత్తు కలిగిన కాన్వాస్ గోదావరి. దాట్ల దేవదానం రాజు ఒక్కో అలని చుట్ట చుట్టకు ఇంటికి తీసుకెళ్ళి, మనసులో పరిచి ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథాశీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటూ తొక్కారు. గోదారి గాలి పీలుస్తూ, గోదారి నీరు సేవిస్తూ, గోదాట్లో స్నానిస్తూ, గోదార్ని జపించే వారికి ఇదేమీ బ్రహ్మవిద్య కాదు.
———–