| పేరు (ఆంగ్లం) | Bhimreddy Narasimha Reddy |
| పేరు (తెలుగు) | భీమిరెడ్డి నరసింహారెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | రాంరెడ్డి |
| జీవిత భాగస్వామి పేరు | సరోజిని |
| పుట్టినతేదీ | 12/15/1923 |
| మరణం | 05/09/2008 |
| పుట్టిన ఊరు | నల్లగొండ జిల్లా |
| విద్యార్హతలు | పదవ తరగతి |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు |
| సంగ్రహ నమూనా రచన | తెలంగాణలో భూస్వాముల, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా మొదట ఆయుధాన్ని భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టి చివరికంటా నిలిచినవాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సుందరయ్య మాటల్లో చెప్పాలంటే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నల్లగొండ జిల్లా గుండె కాయ అయితే, నల్లగొండ జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గుండెకాయ’. |
భీమిరెడ్డి నరసింహారెడ్డి
తెలంగాణలో భూస్వాముల, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా మొదట ఆయుధాన్ని భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టి చివరికంటా నిలిచినవాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సుందరయ్య మాటల్లో చెప్పాలంటే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నల్లగొండ జిల్లా గుండె కాయ అయితే, నల్లగొండ జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గుండెకాయ’.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం. వ్యవసాయక విప్లవాన్ని సాధించటానికి, ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకల్చి, నిజాం నిరంకుశ వ్యవస్థను కూలదోసి ప్రజారాజ్యాన్ని స్థాపించుకోవడానికి, తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటమే ఈ పోరాటం. ఏడు దశాబ్దాలు తెలంగాణ చరిత్రలో బి.ఎన్ నిర్వ హించిన పాత్ర అజరామరమైనది. తెలంగాణ ప్రజలు విస్మరించలేనిది. బి.ఎన్. రాజకీయ స్ఫూర్తి, పోరాటస్ఫూర్తి, నిరాడంబరత, నిస్వార్థ జీవనం నేటి తరానికి మార్గదర్శకం కావాలి.
బిఎన్ అనుభవాలు తెలంగాణ రైతాంగ సాయుధపోరాట చరిత్రకు ప్రతిరూపాలు. ఆయన అనుభవాల్లో తెలంగాణ అమరుల త్యాగాలు ఉన్నయ్. తెలంగాణ నాయకత్వాన్ని అడుగడుగునా అణచివేసిన కుట్రలు ఉన్నయ్. బిఎన్ వ్యక్తిత్వం, పోరాట చరిత్ర యువతరానికి తెలియాల్సిన అవసరముంది.
———–