| పేరు (ఆంగ్లం) | Kaluva Mallaiah |
| పేరు (తెలుగు) | కాలువ మల్లయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | పోచమ్మ |
| తండ్రి పేరు | కాలువ ఓదేలు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/12/1952 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | తేలుకుంట గ్రామం, జూపల్లి మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
| విద్యార్హతలు | బియస్సీ, బి.ఎడ్ |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అగ్ని గుండం,అడవిగాచిన వెన్నెల,అన్న,అమ్మమీది సొమ్ములు,తెలంగాణా కథలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/books/telangana-kadhalu-kaluva-mallaiah/p-7488847-49250587911-cat.html#variant_id=7488847-49250587911 |
| పొందిన బిరుదులు / అవార్డులు | “ఆటా” పురస్కారం |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
కాలువ మల్లయ్య
స్త్రీవాద దృక్పథంతో కాలువ మల్లయ్యగారి కథల్ని పరిశీలించినట్లయితే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కథా వస్తువులుగా స్వీకరించారు. ఇవి తెలంగాణాలోని మూడు తరాల స్త్రీల జీవితాల్ని ఆకళింపు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. భూస్వామ్యవ్యవస్థలో దొరలది తిరుగులేని అధికారం. అయితే దొరల భార్యలైన దొర్సానులది మాత్రం పీడితబ్రతుకే. భర్తలు ఏం చేసినా ప్రశ్నించే హక్కు. స్వాతంత్రంలేక అణిగిమణిగి బతకాల్సి వచ్చింది. ఈ దొర్సానుల బతుకు వెతల్ని కాలువ మల్లయ్యగారు తన కథల్లో చిత్రిస్తూ వచ్చారు. సమస్యలన్నవి అట్టడుగు వర్గాల వారికి మాత్రమే కాదు. అగ్రవర్ణపు స్త్రీలకు కూడా ఉన్నాయని తన కథల్లో నిరూపించారు.
తెలంగాణ సామాజిక జీవనంలో నిజాంపాలనలో భూస్వామ్య వ్యవస్థ కాలం నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని వివిధ పార్శ్వాలను కాలువ మల్లయ్యగారు తన కథల్లో ప్రతి ఫలింపజేస్తూ వచ్చారు. శ్రామిక, పీడిత వర్గాలలోని స్త్రీలు చదువు వల్ల ప్రభావితులైన అనాదిగా ఉన్న పరాధీన భావననుండి విముక్తి పొంది స్వావలంబన దిశగా అడుగులేస్తున్నట్లు కాలువ మల్లయ్యగారు సామాజిక పరిణామాల్ని చిత్రించారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో స్త్రీ కోరుకుంటున్న స్వేచ్ఛ, మగవాళ్ళతో సమానంగా గుర్తింపబడాలనే ఆకాంక్షను ఆయా కథల్లో విశ్లేషించారు. మహిళా చైతన్యానికి దోహదపడే విధంగా కథలు రాసిన కాలువ మల్లయ్య గారు స్త్రీ జాతి పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించుకోగలిగారు.
———–