పేరు (ఆంగ్లం) | Katuru Ravindra Trivikram |
పేరు (తెలుగు) | కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 06/15/1946 |
మరణం | 12/18/2024 |
పుట్టిన ఊరు | విజయవాడ |
విద్యార్హతలు | సాంకేతిక పట్టా |
వృత్తి | ఎయిర్ ఫోర్స్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | 41-16-42, కాటూరు వారి వీధి, కృశ్ణలంక, విజయవాడ, కృష్ణా జిల్లా |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అక్షరాల పందిరి,ఋణం,ఈ మనసేం కావాలి,ఇల్లాలు,ఆపరేషన్ విజయ్,ఆద్యంతాల మధ్య ప్రేమికుడు,అరచేతిలో స్వర్గం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/home/search?q=Katuru%20Ravindra%20Trivikram |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అంతర్నేత్రం |
సంగ్రహ నమూనా రచన | మనం నిత్యమూ సూర్యుని తేజాన్ని చూస్తున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడి తేజస్సు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మనలో కూడా ఒక తేజస్సు ఉందనీ, అదే ‘ఆత్మా’గా చెప్పబడుతోందనీ మనం గ్రహించలేకపోతున్నాం. జ్ఞానమనే చక్షువునే ‘అంతర్నేత్రం’ అంటారు. |
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
మనం నిత్యమూ సూర్యుని తేజాన్ని చూస్తున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడి తేజస్సు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మనలో కూడా ఒక తేజస్సు ఉందనీ, అదే ‘ఆత్మా’గా చెప్పబడుతోందనీ మనం గ్రహించలేకపోతున్నాం. జ్ఞానమనే చక్షువునే ‘అంతర్నేత్రం’ అంటారు. అది విచ్చుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించక తప్పదు. అగ్నిదేవుడు సర్వభక్షకుడు. దేన్నయినా దహిస్తాడు కానీ పాపాలను, అజ్ఞానాన్ని దహించలేడు. మనకు ప్రధమ శత్రువు, చివరి శత్రువు మన్మధుడే. శివుడు మన్మధుని దహించినా, అనంగుడిగానే మనల్ని వేధిస్తుంటాడు.
శరీర భ్రమలోంచి బయట పడటం, కోరికలు లేని జీవితం గడపటం – ఇవి రెండూ ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనలు. శరీరం మీద ఎన్ని ఆధ్యాత్మిక చిహ్నాలు ధరించినా, అంతరంగం పరిశుద్ధం కానిదే, అంతర్నేత్రం తెరుచుకోదు. అంతర్నేత్రాన్ని మేల్కొలిపే ప్రయత్నంగానే ఈ ఆధ్యాత్మిక వ్యాసాలను పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాను.
– కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
———–